సన్న వడ్లకు బోనస్ ఏదీ?:హరీశ్

14
- Advertisement -

సన్న వడ్లకు బోనస్ ఏదో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. మీడియాతో మాట్లాడిన హరీశ్‌…కొనుగోలు పూర్తయి 75 రోజులు దాటినా కూడా రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి అద్దం పడుతుందన్నారు.

పంట కొనుగోలు చేసిన 48 గంటల్లోనే డబ్బులు వేస్తామని ప్రగల్బాలు పలికి…రెండు నెలలు దాటినా ఇప్పటికీ రైతుల ఖాతాలో డబ్బులు జమ కాకపోవడం శోచనీయం అన్నారు. వెంటనే రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ. 1,116 కోట్ల సన్నాల బోనస్ డబ్బులను విడుదల చేయాలన్నారు.

యాసంగిలో రైతు భరోసా సగం మందికి కూడా ఇవ్వలేదు…. ఎన్నికల ముందు 15 వేల రైతు భరోసా అని చెప్పి మాట తప్పి 12,000కి పరిమితం చేశారు. కౌలు రైతులకు కూడా రైతు భరోసా అని చెప్పి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదు అన్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనా, యాసంగిలో కొనుగోలు చేసిన సన్నాలకు ఒక్క రూపాయి కూడా ప్రభుత్వం బోనస్ చెల్లించకపోవడం రైతులను వంచించడమేనన్నారు.

పంట పెట్టుబడి సహాయం అందించడంలో వైఫల్యం. పండించిన పంటకు గిట్టుబాటు ధర కేటాయించడంలో వైఫల్యం. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలో వైఫల్యం. ధాన్యం కొనుగోలు చేయడంలో వైఫల్యం. కొన్న ధాన్యానికి డబ్బులు చెల్లించడంలో వైఫల్యం చెందిందన్నారు.

Also Read:బిహార్‌కు ప్రధాని మోదీ

- Advertisement -