దసరా వేడుకల్లో భాగంగా సిద్దిపేట నర్సాపూర్ జమ్మి హనుమాన్ దేవాలయం వద్ద కాశీ గంగా హారతి, రావణ దహన కార్యక్రమం నిర్వహించారు. మన బతుకమ్మ… మన దసరా అనే సంస్కృతి సంప్రదాయాల పండుగ మన తెలంగాణ అన్నారు మాజీ మంత్ఇర హరీష్ రావు. వ్రేలు పట్టుకొని బడికి ఎలా తీసుకెళ్తారో.. నేటి పిల్లలకు మన సంస్కృతి సంప్రదాయం అలా నేర్పించాలి…
బావి తరాలకు మనం ఇచ్చే సంపద మన సంస్కృతి.. సాంప్రదాయాలేనని తెలిపారు.
దేశ విదేశాల్లో మన పండగలను గొప్పగా జరుపుకుంటారు… దసరా మనకు పెద్దలపై గౌరవాన్ని గుర్తు చేస్తుంది మనలో చెడును తొలగించి మంచిని నేర్పుతుంది… నేడు నర్సాపూర్ లో దసరా ఉత్సవం ఘనంగా జరుగుతుంది..గంగా హరతి కార్యక్రమం పెట్టడం అభినందనీయం.. కాశీలో గంగా నది తీరాన జరిగే ఈ హారతి నేడు సిద్దిపేటలో జరగడం చాలా సంతోషం… కాశీ నుండి పురోహితులు సిద్దిపేట కు వచ్చి హారతి ఇచ్చి కాశీనే తలపింపజేశారు… దసరా అంటేనే చెడుపై మంచి విజయం అన్నారు.
ధర్మం మీద న్యాయం గెలుస్తుంది అని అర్థం…సిద్దిపేట జిల్లా… సిద్దిపేట కు రైలు కల…మెడికల్ కాలేజీ, అన్ని తెచ్చుకునం…నిత్యం నిండు కుండలా జలకలతో ఉండే కాళేశ్వరం రంగనాయక సాగర్ ని నిర్మించుకున్నాం.. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందాం… రాష్ట్రంలో అన్ని వర్గాలు ఆగంలో అయోమయంలో ఉన్నారు వ్యాపారం లేదు, రియల్ ఎస్టేట్ పడిపోయింది .. దేవుణ్ణి ప్రార్థిస్తున్న అంత మంచి జరగాలని మళ్ళీ మంచి రోజులు రావాలని… జమ్మి పెట్టి తల్లిదండ్రులు ఆశీస్సులు తీసుకోవాలి… పూలను పూజించే పండగ బతుకమ్మ పండగ తెలంగాణ సంస్కృతి.. కుల మతాలకు అతీతంగా మనం పండగలు జరుపుకుంటున్నాము అన్నారు.
Also Read:రూ.150 కోట్ల క్లబ్‌లో ‘మిరాయ్’

