మున్సిపల్ ఎన్నికలు ఉన్న కారణంగా రైతుబంధు నిధులు వేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. కరోనా మహమ్మారి వంటి అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా మాజీ సీఎం కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ఆపలేదని ఆయన గుర్తుచేశారు. ఎన్నికలు ఉన్నా రైతులకు మేలు చేయాలనే ఆలోచనతో కేసీఆర్ ఎప్పుడూ ముందుండేవారని చెప్పారు.
రైతుబంధు డబ్బులు వేయడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని, అవసరమైతే ఎన్నికల సంఘానికి లేఖ రాయడానికి కూడా సిద్ధమని హరీష్ రావు స్పష్టం చేశారు. గతంలో ఎగ్గొట్టిన రెండు విడతల రైతుబంధుతో పాటు, ఇప్పటి విడత కలిపి మొత్తం మూడు రైతుబంధు నిధులను వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
రేవంత్ రెడ్డి హార్వర్డ్‌కు వెళ్లినా, అంతరిక్షానికి వెళ్లినా ఆయన వైఖరిలో మార్పు ఉండదని, కుక్క తోక వంకరలాగే ఉంటుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన నోట్లో నుంచి బూతులు తప్ప మరేమీ రావట్లేదని ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ముమ్మాటికి జాతిపిత అని, రేవంత్ రెడ్డి మాత్రం బూతుపితగా మారారని హరీష్ రావు ఘాటు వ్యాఖ్యలు చేస్తూ, రైతుల విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు.
Also Read:భారత్‌తో మ్యాచ్ ఆడబోం:పాక్ ప్రధాని

