ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు కూడా లేదా అని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. టీజీపీఎస్‌ను ముట్టడించిన నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకుల అరెస్టు అక్రమమన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్.. తమ గోసను రిప్రజెంటేషన్ ద్వారా చెప్పుకునే అవకాశం కూడా లేదా అని నిలదీశారు.
సమస్యలు పరిష్కరించే దాక, డిమాండ్లు సాధించే దాకా వదిలిపెట్టేది లేదని … విద్యార్థులు, నిరుద్యోగుల తరుపున గొంతెత్తుతామని స్పష్టం చేశారు. ఒక వైపు ప్రజా పాలన అని ప్రచారం చేసుకుంటూ నిరుద్యోగుల గొంతులను, హక్కులను రేవంత్ రెడ్డి సర్కార్ అణగదొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఇది ముమ్మాటికీ ప్రజాపాలన కాదని, అప్రజాస్వామ్యపాలన అని దుయ్యబట్టారు. విద్యార్థులు, విద్యార్థి సంఘాల నాయకులు, నిరుద్యోగుల అరెస్టులను తక్షణం నిలిపివేయాలని డిమాండ్ చేశారు. నిర్బంధించిన వారిని, అరెస్టులు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలన్నారు.
Also Read:ఆకలి వేయట్లేదా..ఇలా చేయండి!