ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందాల పోటీల్లో బిజీగా ఉన్నాడు…అందాల పోటీల మీద రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నాడు అని దుయ్యబట్టారు మాజీ మంత్రి హరీష్ రావు. వేలాదిమంది పోలీస్ లను, ప్రభుత్వాధికారులను నియమించి అందాల పోటీలను నిర్వహిస్తున్నారు….కానీ దేశానికి అన్నం పెట్టే రైతు కోసం, ఆరుగాలం కష్టపడే రైతు కష్టం తీర్చడానికి ఈ ముఖ్యమంత్రికి సమయం లేకపోవడం చాలా దురదృష్టకరం అన్నారు.
తెలంగణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్… ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల ఏ పాటి చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది…ధాన్యపు రాశులను గాలికి వదిలేసి, అందాల పోటీలతో అందాల రాశుల చుట్టూ ముఖ్యమంత్రి గారు, ప్రభుత్వ యంత్రాంగం తిరుగుతున్నది అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల్లో రైతులను అరిగోస పెడుతోంది. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుంది అన్నారు.
ఈ యాసంగికి 70 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొంటామని ప్రభుత్వం చెప్పింది కానీ 40 లక్షల మెట్రిక్ టన్నులు కూడా దాటలేదు..కొన్న వడ్లకు 4 వేల కోట్లు బకాయి పడింది….48 గంటల్లో కొన్న ధాన్యానికి రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రగల్బాలు పలికారు అన్నారు. పది రోజులైనా కొన్న పంటకు డబ్బులు దిక్కులేదు… బోనస్ ఊసే లేదు. యాసంగి పంటకు 512 కోట్ల రూపాయలు సన్నాలకు బోనస్ చెల్లించాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఐదు పైసలు కూడా విడుదల చేయలేదు అన్నారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులు రోజుల తరబడి ఎదురుచూస్తున్నటువంటి పరిస్థితి… కొనుగోలు కేంద్రాల్లో నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉన్నది అన్నారు.లారీలు లేక కొన్న లక్ష మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులోకి పోకుండా మిగిలిపోయింది…పెట్టుబడి సహాయం అందించడంలో జాప్యం జరిగిందన్నారు. వానకాలం రైతు బంధు ఎగ్గొట్టిర్రు. యాసంగి రైతుబంధు మూడెకరాలకు మించి వేయలేదు…పెట్టుబడి సాయం కోసం 18 వేల కోట్లు బడ్జెట్లో పెట్టామని భట్టి గారంటున్నారు. సంవత్సరమంతా మెల్లగా ఇస్తామని అంటున్నారు…కోతలు అయిపోయినా యాసంగి పెట్టుబడి సహాయం ఇంకా వెయ్యలేదు అన్నారు.
ఎన్నికల ముందు కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు మేం 15,000 ఇస్తాం. అది కూడా పంట సీజన్ ప్రారంభం కంటే ముందే ఇస్తామన్నారు…కానీ ఇప్పుడేమో ఓడ దాటాక బోడ మల్లన్న అన్న విధంగా వ్యవహరిస్తున్నారు…పంట పెట్టుబడి సాయం రైతులకు అందించడంలో జాప్యం..కొనుగోలు కేంద్రాల్లో ధాన్యానికి తక్షణమే కాంటా వేయడంలో జాప్యం అన్నారు.కొన్న ధాన్యాన్ని తరలించడంలో జాప్యం..ధాన్యం అమ్మిన తర్వాత రైతుల ఖాతాల్లో డబ్బులు వేయడంలో జాప్యం,గన్నీ బ్యాగులను సమకూర్చడంలో వైఫల్యం,ధాన్యాన్ని లారీలకు ఎక్కించే హమాలీలను సమకూర్చడంలో వైఫల్యం అన్నారు.
చివరికి పాకిస్తాన్ ని నమ్మి అప్పు ఇస్తున్నారు కానీ రేవంత్ రెడ్డిని నమ్మి అప్పు ఇవ్వడం లేదు..ప్రతిపక్షం మీద బురదజల్లబోయి నువ్వు తీసుకున్న గోతిలో నువ్వే పడ్డావు…ప్రభుత్వాన్ని నడపడం అంటే ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోసినంత సులువు కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి పాలనపై దృష్టి సారించి, రైతుల కష్టాలను తీర్చాలని డిమాండ్ చేస్తున్నాము…మంత్రులు, అధికారులు క్షేత్రస్థాయిలో తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి రైతులకు నష్టం జరగకుండా చూడాలి అన్నారు. సీఎం అసెంబ్లీలో ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు…తరుగు, తాలు పేరు మీద ఐదు నుండి పది కిలోలు తరుగు తీస్తున్నారు కాబట్టి తరుగు లేకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం…రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తుందని హెచ్చరిస్తున్నాము అన్నారు.
సోషల్ మీడియాలో చేస్తున్న తప్పుడు ప్రచారం, వార్తల పై నేను అదే రోజు ఖండించాను,పార్టీ నాయకులు దాసోజు శ్రవణ్ గారు, ఎర్రోళ్ల శ్రీనివాస్ గారు పోలీస్స్టేషన్లో కంప్లైంట్ చేశారు…కొన్ని వందలసార్లు చెప్పాను కేసీఆర్ గారు మా పార్టీ అధ్యక్షులు, వారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించే క్రమశిక్షణ కలిగిన కార్యకర్త హరీష్ రావు అని..పార్టీ నిర్ణయాన్ని, కేసీఆర్ నిర్ణయాన్ని శిరసావహిస్తాను తప్ప పార్టీ నిర్ణయాన్ని జవదాటను..మై లీడర్ ఇస్ కేసీఆర్. వాట్ ఎ వర్ కేసీఆర్ సే హరీష్ రావు విల్ ఫాలో అని స్పష్టం చేశారు.
Also Read:BRS:సోషల్ మీడియాలో అసత్య ప్రచారం.. ఫిర్యాదు

