రైతులకు రైతు బంధు రాదు, రుణమాఫీ పూర్తి కాదు, బోనస్ బొగస్ అయిపాయె, పంటలు కొనే దిక్కు లేదు అని ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి హరీశ్ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీశ్ రావు..పత్తి రైతులకు మద్దతు ధర ఏది..?, ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులకు డబ్బులు ఇవ్వని ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డిది అన్నారు.
అడ్డగోలు హామీలిచ్చి, అధికారంలోకి వచ్చినాక విద్యార్థులను, నిరుద్యోగులను చివరికి ఉద్యోగులను కూడా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. బండి సంజయ్ తీరు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిలా కాకుండా, రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పని చేస్తున్నట్టు ఉందన్నారు. ఎన్నికల ముందు నేను పోలీస్ బిడ్డను అంటూ పెద్ద పెద్ద పొంకనాలు కొట్టి, ఇవ్వాళ పోలీసులు తమ కుటుంబ సభ్యులను తామే అరెస్ట్ చేసే దుస్థితిని రేవంత్ రెడ్డి అన్నారు.
తెలంగాణలో రక్షక భటులకే రక్షణ లేని రాక్షస పాలన నడుస్తుందన్నారు. మూసీ పేరుతో రేవంత్ చేస్తున్న అవినీతిని బయటపెట్టినందుకే కేటీఆర్ కుటుంబ సభ్యులపై దాడికి దిగుతున్నారన్నారు. కేటీఆర్ క్యారెక్టర్ దెబ్బ తీసే కుట్ర సరికాదన్నారు. కంచెలు లేని పాలన అని చెప్పి.. కర్ఫ్యూ పాలన తెచ్చారని మండిపడ్డారు హరీశ్ రావు.
Also Read:KTR: దీపావళికి రైతులు దివాళా తీయడమేనా?