అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం అని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్..ప్రజల సమస్యలను జడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా..? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాప్రతినిధులు సైతం ప్రభుత్వాన్నిప్రశ్నించలేని పరిస్థితి. ఇలాంటి బెదిరింపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు. ప్రతీకార చర్యలను, అక్రమ కేసులను చట్టపరంగా ఎదుర్కొంటాం. ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తాం అని హరీశ్‌రావు తేల్చిచెప్పారు.
హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే @KaushikReddyBRS పై క్రిమినల్ కేసు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజల సమస్యలను జెడ్పీ సమావేశం దృష్టికి తీసుకురావడమే కౌశిక్ రెడ్డి చేసిన తప్పా.?
ప్రశ్నించే గొంతులను అక్రమ కేసులు బనాయించి మూయించడమేనా ప్రజా పాలన.?
కాంగ్రెస్ పాలనలో… pic.twitter.com/B0LweUkHN9
— Harish Rao Thanneeru (@BRSHarish) July 3, 2024
Also Read:14 నుండి సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు