Harishrao: కేటీఆర్‌పై దాడిని ఖండించిన హరీశ్‌

4
- Advertisement -

కేటీఆర్ పై కాంగ్రెస్ రౌడి మూకల దాడిని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి హరీష్ రావు. రాహుల్ గాంధీ గారూ.. ఇదేనా మీరు చెప్పిన नफरत के बाजार में मोहब्बत की दुकान? అని ప్రశ్నించారు. మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింట్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై జరిగిన కాంగ్రెస్ రౌడీ మూకల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రజా సమస్యల పట్ల పోరాటం చేస్తున్న ప్రతిపక్షాల మీద దాడులు చేయడమేనా ప్రజా పాలన అంటే అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల మీద దాడులు, నాయకుల అరెస్టులు, అక్రమ కేసులు.. ఇదేనా మీరు చెప్పిన ప్రజాస్వామ్య పునరుద్దరణ అంటే ఇదేనా అన్నారు. కేటీఆర్ గారిపై దాడికి తెగబడిన వారిని గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు హరీశ్‌.

 

Also Read:KTR: సీఎం రేవంత్ ఢిల్లీ టూర్ పై కేటీఆర్ ఫైర్

- Advertisement -