తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. పరిగి ఇండస్ట్రియల్ పార్క్ వివాదంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అరెస్టులు, ఆంక్షలు విధించినా తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.SC, STలకు పట్టా భూములు ఇస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. పేదల భూములను బలవంతంగా తీసుకోవద్దని, రైతుల హక్కులను కాపాడాలని ఆయన కోరారు.
పరిగిలో ప్రతిపాదిత ఇండస్ట్రియల్ పార్క్ నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఇప్పటికే భూములు కోల్పోతున్న రైతులకు ఆ భూములను తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు.పరిగి పర్యటనకు వెళ్లకుండా పోలీసులు హరీశ్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. ఇండస్ట్రియల్ పార్క్ బాధిత రైతులను కలవకుండా బీఆర్ఎస్ నేతలపై కూడా ఆంక్షలు విధించారు.
Also Read:‘గాయపడ్డ సింహం’లో జేడి!
ఈ క్రమంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహా ఉమ్మడి రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలకు చెందిన పలువురు నేతలను గృహ నిర్బంధం చేశారు. అలాగే పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.మమ్మల్ని ఎంత అడ్డుకున్నా, పరిగికి వెళ్లి రైతుల తరపున పోరాటం చేస్తాం అని హరీశ్ రావు స్పష్టం చేశారు. రైతుల భూముల కోసం చివరివరకు పోరాడతామని ఆయన తెలిపారు.

