దివ్యాంగులపై స్మితా సబర్వాల్ వ్యాఖ్యలు సరికావన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీష్… పంటల రుణమాఫీకి రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధన అమలు చేస్తున్నారు.. ఈ నిబంధనల వల్ల చాలా మంది రైతులకు రుణమాఫీ కావట్లేదు అని ఆరోపించారు.
వృద్ధ్యాప్య పెన్షన్లు సమయానికి రావడం లేదని…. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై రేవంత్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నిరుద్యోగులపై లాఠీలు ఝులిపిస్తున్నారు అని మండిపడ్డారు. రుణమాఫీలో కోతలు పెట్టేందుకే రేషన్ కార్డు, పీఎం కిసాన్ నిబంధనలు అమలు చేస్తున్నారు అని మండిపడ్డారు. ప్రత్యేక విభాగాల వైద్యులను జిల్లాలకు బదిలీ చేశారన్నారు.
ప్రస్తుత విభాగాల్లోనే సూపర్ స్పెషాలిటీ నిపుణులను కొనసాగించాలని, ఉద్యోగులకు డీఏలు ఇస్తామన్న హామీ ఇప్పటికీ నెరవేరలేదు అన్నారు. పోలీసు శాఖలో డీజిల్ డబ్బులు ఇవ్వడం లేదు. హోంగార్డులకు జీతాల్లేవు అన్నారు. కల్యాణలక్ష్మి పథకం ఆగిపోయిందని…రైతుబీమా చెక్కులకు కనీసం నెల సమయం పడుతోందని మండిపడ్డారు.
Also Read:తెలుగు ట్రెండింగ్‌లో ‘డెడ్ పుల్ అండ్ వాల్వరిన్’