బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇంఛార్జీ మన్నె క్రిశాంక్ అరెస్ట్ అప్రజాస్వామికమన్నారు ఎమ్మెల్యే హరీష్. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ట్వీట్ చేసిన హరీష్…ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హెచ్చరించారు.
ఉస్మానియా యూనివర్సిటీ హాస్టళ్ల మూసివేతపై సోషల్ మీడియాలో ఫేక్ సర్క్యులర్లు వైరల్ చేశారంటూ క్రిశాంక్‌పై కేసు నమోదైంది. తన సంతకం ఫోర్జరీ చేయడంతోపాటు, ఫేక్ సర్క్యులర్ ప్రచారం చేసిన క్రిశాంక్, ఇతర బీఆర్‌ఎస్వీ నాయకులపై చర్యలు తీసుకోవాలని చీఫ్ వార్డెన్ మంగళవారం ఓయు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఐపీసీ 469, 465, 468, 417, 471, 505 (1) (బీ),(సీ) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
బీఆర్ఎస్ నాయకుడు క్రిషాంక్ అరెస్టు అప్రజాస్వామికం.
ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా?
ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీ కలిసి చేస్తున్న ఈ కక్ష సాధింపులకు మూల్యం చెల్లించక తప్పదు. https://t.co/5vsXsFRMPB— Harish Rao Thanneeru (@BRSHarish) May 2, 2024
Also Read:ఈ ఆసనాలతో గుండెపోటు కు చెక్..!