Harishrao:రేవంత్‌ది మూర్ఖత్వం

14
- Advertisement -

మెదక్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తన మూర్ఖత్వాన్ని మరోసారి చాటుకున్నాడన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. గజ్వేల్‌లో మీడియాతో మాట్లాడిన.. మెదక్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అసహనం వ్యక్తం చేస్తున్నాడు..ప్రతిపక్షంలో ఉండగా రాష్ట్రంలో అభివృద్ధి గజ్వేల్‌లో మెదక్ జిల్లాలో మాత్రమే జరిగిందని చెప్పి, ఇప్పుడు ఇంకా అభివృద్ధి కాలేదని తప్పుడు ప్రచారం చేస్తున్నాడన్నారు.ఇందిరాగాంధీ మెదక్‌కి ఏం చేసింది? మెదక్‌లో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసింది, రైల్వే లైన్ తెచ్చింది కేసీఆర్ అన్నారు.

మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించి లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిండు. మూడు యూనివర్సిటీలు తెచ్చిండు..మెదక్‌లో ఏం అభివృద్ధి జరిగిందో కళ్లు పెద్దవి చేసి చూడు రేవంత్. లేకపోతే నువ్వొస్తే నేను చూపిస్తా అన్నారు.మెదక్, సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తా అంటున్న నువ్వు ఈరోజు మా జిల్లా గురించి మాట్లాడుతావా?…సింగూరు జలాలు మెదక్ జిల్లాను తాకాయంటే అది కేసీఆర్ చలవే. ఉమ్మడి పాలనలో మెదక్ సింగూరు నీళ్లు తరలించుకుపోలేదా? అని ప్రశ్నించారు. రాజకీయాల్లో విలువలు ఉండాలి. ముఖ్యమంత్రి పదవిపై గౌరవంతో నీ ఎత్తు గురించి మాట్లాడడం లేదన్నారు.కానీ నీకు నీ భాషలోనే మాట్లాడితనే అర్థం అవుతుంది..మాటిమాటికి దూలమోలే పెరిగావ్ అంటున్నావ్. భూమికి జానెడు ఉన్న నీకు ఆవగింజంత మెదడు కూడా దేవుడు ఇవ్వలేదు అని నేననాలా?
సీఎం పదవిలో ఉండి సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నాడన్నారు.

పాత రాతియుగం మాటలు బంద్ చేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూడు రేవంత్ కేసీఆర్ మెదక్‌కు చేసిన అభివృద్ధి కనపడుతుంది..మెదక్‌ను జిల్లా కేంద్రం చేయాలని కోరితే కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదు. రైలు సౌకర్యం కల్పించాలంటే పెడచెవిన పెట్టారు. సింగూరు జలాలు మెదక్ రైతులకే ఇవ్వాలనే డిమాండ్‌పై ధ్యాస పెట్టలేదు అన్నారు.ఇవన్నీ చేసింది కేసీఆర్ కాకపోతే మీ అయ్య వచ్చి చేశాడా రేవంత్ రెడ్డి?..ఆరోగ్యం బాగాలేని కేసీఆర్ రైతులను పరామర్శిస్తుంటే రేవంత్ తాపీగా క్రికెట్ చూస్తున్నాడన్నారు. పాలన చేతగాక, నా ప్రశ్నలకు జవాబు చెప్పడం చేతగాక నాపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేస్తున్నాడు..తెలంగాణ తెచ్చిన ఆ మహానేతపై ఇష్టమొచ్చినట్టు మొరగడాన్ని ప్రజలు గమనిస్తున్నారు..మోదీతో రేవంత్ కుమ్మక్కయ్యారని కాంగ్రెస్ శ్రేణులతో పాటు ప్రజలంతా నమ్ముతున్నారన్నారు.

Also Read:ఆలుగ‌డ్డ జ్యూస్‌తో ప్రయోజనాలు?

- Advertisement -