సబితా ఇంద్రారెడ్డిపై దౌర్జన్యమా?:హరీష్‌

5
- Advertisement -

మొట్ట మొదటి మహిళా హోంమంత్రి, సీనియర్ శాసన సభ్యురాలు అయిన సబితా ఇంద్రారెడ్డిపై కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇందిరమ్మ రాజ్యం అని చెప్పుకుంటూ మహిళా సభ్యురాలి పట్ల ఇంత కర్కశంగా, అవమానకరంగా వ్యవహరించడం సిగ్గుచేటు అన్నారు.

రేషన్ కార్డుల విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయడమే సబిత గారు చేసిన తప్పా?, మంత్రి సమక్షంలోనే కాంగ్రెస్ నాయకులు వీధి రౌడీలుగా బెదిరింపులకు పాల్పడుతుంటే అడ్డుకోవాల్సిన పోలీసులు వారితో కలిసి మహిళా ఎమ్మెల్యే పై దౌర్జన్యానికి పాల్పడడం దుర్మార్గం అన్నారు.

సబిత గారిపై అనుచితంగా, అమర్యాదగా ప్రవర్తించిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలి. హోంమంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తాటాకు చప్పుళ్లకు, రౌడీ మూకల దాడులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదని.. మిమ్మల్ని నిలదీస్తూనే ఉంటం. ప్రజాక్షేత్రంలో మీ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటం అని తేల్చిచెప్పారు.

Also Read:తెలంగాణ దిక్సూచి..జయశంకర్ సార్

- Advertisement -