Harishrao:నాలాపైనే హైడ్రా ఆఫీస్..దానిని కూల్చండి

24
- Advertisement -

రుణమాఫీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంత తక్కువ మాట్లాడితే అంతమంచిదన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడిన హరీశ్‌ రావు..రుణమాఫీ చేస్తా అని ప్రజలను మోసం చేసిన గజదొంగ రేవంత్ రెడ్డి అన్నారు. ఆగస్టు 15లోపు 100శాతం చేస్తా అని చెప్పి..రుణమాఫీ కాలేదు అని మీ ఎమ్మెల్యే బ్యాంకర్లు పైన కాగితలు విసిరి వేశారు అన్నారు.

రుణమాఫీ కాలేదు అని రెవిన్యూ, వ్యవసాయా మంత్రులు చెప్పారు..నా ఛాలెంజ్ 100 శాతం చేయాలి అనేది కదా అన్నారు. రుణమాఫీ ఛాలెంజ్ విషయంలో ఎవరు గెలిచారు అన్నది గల్లీలో ఉన్న లీడర్స్ అడిగి చెప్తా…రాహుల్ గాంధీ గారు వస్తే రుణమాఫీ అయిందా లేదా అని ఏ గ్రామానికైనా వెళదాం, లేకపోతే మా నియోజవర్గములోని ఏ గ్రామంకైనా వెళదాం రైతులు అడుగుదాం అన్నారు.

రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డి సొంత గ్రామానికి తీసుకొని వెళ్ళతాను ..రాహుల్ గాంధీని కూడా రేవంత్ రెడ్డి మోసం చేశాడన్నారు. రేవంత్ రెడ్డి నిజస్వరూపం బయట పడుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 10 ఏళ్లు కష్టపడి నిర్మించిన పది సంవత్సరాలు హైదరాబాద్ బ్రాండ్ ని కూల్చేశారు అన్నారు. బుద్ధా భవనములోనే హైడ్రా ఆఫీస్ ఉంది, దానిని కులాగోటమనండి.. అది కూడా నాలా మీదనే ఉంది అన్నారు. జీహెచ్‌ఎంసీ బిల్డింగ్ ని కూడా కూలగొట్టాలని.. ఇది కూడా నాలా మీదనే ఉందన్నారు. జలవిహార్, నెక్లెస్ రోడ్, నెక్లెస్ రోడ్ లో ఉన్న బోట్స్ క్లబ్, జలవిహార్ ని కూలగొట్టు అని సవాల్ విసిరారు.

Also Read:మాజీ సీఎం కేసీఆర్‌ని కలిసిన ఎమ్మెల్సీ కవిత

- Advertisement -