Harishrao:నిరుద్యోగ భృతి ఏది?

30
- Advertisement -

జిల్లాల్లో పర్యటించినపుడు రైతు బంధు ఇంకా తమకు రాలేదని ప్రజలు పిర్యాదులు వస్తున్నాయన్నారు మంత్రి హరీష్‌ రావు. బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో చిట్ చాట్‌గా మాట్లాడిన హరీష్‌.. వంద రోజుల్లో గ్యారంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది….మార్చి 17 తో వంద రోజులు పూర్తవుతాయన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తులు తీసుకుంటున్నారన్నారు.

పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి ..ఫిబ్రవరి నెలాఖరు లో షెడ్యూల్ వచ్చే అవకాశముందన్నారు. కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముందని….పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ లోపే 6 గ్యారంటీల్లోని పదమూడు హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయని…..గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవో లు విడుదల జేస్తే కోడ్ వచ్చినా ఇబ్బందేముండదన్నారు.

శ్వేత పత్రాలు కూడా హామీల ఎగవేతల పత్రాలా అనే అనుమానం కలుగుతోంది ఈ విషయాన్ని అసెంబ్లీ లో కూడా చెప్పాం అన్నారు. ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించి ఏమీ చేసినా ఫిబ్రవరి 20 వ తేదీ లోగానే చెయ్యాలని….ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచన లో ఉన్నట్టు తెలుస్తోందన్నారు. ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుందన్నారు. రైతు బంధు డబ్బుల పై మా ప్రభుత్వం అపుడు ప్రతి రోజూ ప్రెస్ నోట్ ఇచ్చేది…
..అసెంబ్లీ లో శ్వేత పత్రాలు ఇచ్చిన వారికి రైతు బంధు డబ్బుల పై ప్రతి రోజూ ప్రెస్ నోట్ ఇవ్వడం లో ఇబ్బంది ఏమిటీ ? అన్నారు. నిరుద్యోగ భృతి పై డిప్యూటీ సీఎం భట్టి రాహుల్ ,ప్రియాంక ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మాట్లాడారు..జాబ్ కేలండర్ ప్రకటించిన వాళ్ళు ఇప్పట్నుంచే మార్గ దర్శకత్వాలు రూపొందించుకోవాలి కదా అన్నారు.

Also Read:అందరికి నచ్చే.. సర్కారు నౌకరి

- Advertisement -