ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి

1
- Advertisement -

ఎనుముల రేవంత్ రెడ్డి కాగు ఎగవేతల రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం రూ. రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరులో రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్‌లైన్…దసరా లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం అని హెచ్చరించారు.

ఏదో సామెత అన్నట్టు పాలేవో నీళ్ళేవో తేలాలంటే కొద్దిగా టైం పడుతది..కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండే కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ అర్థమైందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండే. రైతులకు ఎరువు బస్తా కావాలంటే పొద్దున ఐదు గంటలకు చెప్పులు లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేది అన్నారు. రైతులను ఎరువు బస్తాల కోసం లైన్ల నిలబెట్టింది కాంగ్రెస్…కేసీఆర్ ప్రతి ఊరికి ఎరువులను లారీల్లో పంపి రైతులకు అందించారు అన్నారు.

కేసీఆర్ రాకముందు కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు…కేసీఆర్ వచ్చినంక 24 గంటల కరెంటు ఇచ్చిండు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలకుండా కడుపునిండా రైతులకు కరెంటు ఇచ్చిండు అన్నారు. కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ వచ్చేది. కేసీఆర్ 24 గంటలు కరెంట్ అందించాడు అన్నారు. మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు…కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణికా రెడ్డి గారు ఏదో మీటింగ్‌లో అంటున్నారు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎందుకు వస్తలేదని కరెంట్ అధికారులను అడుగుతుందన్నారు.

రైతుబంధుకు కేసీఆర్ ఉండంగా ఎకరానికి రూ.4,000 ఇచ్చిండు. మల్ల గెలిస్తే రూ.5,000 ఇస్తానని ఇచ్చిండు. మళ్లీ గెలిస్తే రూ. 8,000 చేస్తా అన్నాడు గెలిస్తే చేస్తుండే అన్నారు. కాంగ్రెస్ గెలిచి రూ. 7,500 రైతుబంధు ఇస్తా అన్నారు. పోయిన యాసంగికి రూ. 5,000 ఇచ్చిండ్రు. ఈ పంటకు మొత్తానికి ఎగబెట్టారు అన్నారు. రైతులను అప్పుల పాలు చేస్తున్నడు రేవంత్ రెడ్డి. పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఏర్పడిందని…అబద్ధాలు చెప్పి కుంటి సాకులు చెప్పి ఇప్పటిదాకా రైతులకు రైతుబంధు పైసలు ఇవ్వలేదు అన్నారు. రాష్ట్రంలో రైతులను ఆగం చేయడం కాదా? కేసీఆర్ ఒక్కసారి కాదు 11 సార్లు రైతుబంధు ఇచ్చిండు అని గుర్తు చేశారు.

Also Read:వీరమనితో బీఆర్ఎస్ నేతల సమావేశం

- Advertisement -