నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా: హరీశ్‌

15
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో SLBC పనులు జరగలేదని నిరూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా..లేదంటే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా ? అని డిమాండ్ చేశారు.

ప్రతిపక్ష శాసన సభ్యునిగా నేను నిర్మాణాత్మకంగా బాధ్యతా యుతంగా వ్యవహరించాను ప్రమాద సహాయక చర్యలకు తగిన గడువిచ్చిన తర్వాత ప్రమాద స్థలానికి చూడడానికి పోయాను. తాను రాకపోగా వెళ్లిన నన్ను అడుగడుగున నిర్బంధించిన ఈ ముఖ్యమంత్రి ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రమాద ఘటన స్థలం నుండే నీచ రాజకీయాలకు పాల్పడుతున్నాడు అని ఆరోపించారు.

 

Also Read:ఇంటర్ పరీక్షలు..హాల్‌ టికెట్‌పై క్యూఆర్ కోడ్

- Advertisement -