సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్‌ రావు సవాల్..

3
- Advertisement -

సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. రుణమాఫీ అయింది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు…దమ్ముంటే ఇక్కడికి రా చూపెడతా అని సవాల్‌ విసిరారు హరీశ్‌. వడ్డీతో సహా రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఇప్పుడు మిత్తీ కట్టించుకున్ని పాక్షిక రుణమాఫీ చేస్తున్నారని ఆరోపించారు.

అబద్ధాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పాలనలో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నదని … దరఖాస్తుల పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి మాటలు నమ్మి ఎంతోమంది రైతులు ఆగమయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి మాటలు నీటి మూటలు, రుణమాఫీ సగం కూడా చేయలేదన్నారు.

రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చడం తప్పా ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. వ్యవసాయ కూలీల అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలన్నారు. గ్రామ సభల్లో ప్రోటోకాల్ పాటించడం లేదని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఏడాదిలోనే ఎంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్ ఇచ్చిన మాట ప్రకారం హామీ నెరవేరుస్తున్నాడు.

Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుకు గుండెపోటు

- Advertisement -