Harishrao:ఏడాది పాలన అంత అబద్దాలే!

1
- Advertisement -

మహబూబ్ నగర్ రైతు పండుగలో రేవంత్ రెడ్డి సహా మంత్రులు ఎంత మొత్తుకున్నా దండుగే అయ్యిందన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన హరీశ్‌.. ఆడంబరంగా నిర్వహించిన కార్యక్రమం యావత్ తెలంగాణ రైతాంగాన్ని ఉసూరుమనిపించిందన్నారు. ఏడాది పూర్తయిన సందర్భంగానైనా రైతులందరికీ రుణమాఫీ, వానాకాలంతో పాటు ఈ యాసంగికి ఇచ్చే రైతు భరోసా మొత్తం కలుపుకొని ఎకరాకు 15వేలు ప్రకటిస్తారనుకుంటే మరోసారి మొండి చెయ్యి చూపారు అన్నారు.

ఇక కౌలు రైతులు, ఉపాధి కూలీలకు రైతు బంధుకు అతీగతీ లేదు… రైతు పండుగ పేరుతో రేవంత్ రెడ్డి రైతులను మాయమాటలతో మరోసారి మోసం చేసారు.కేసీఆర్ ప్రారంభించిన రైతు బీమా పథకాన్ని కూడా కాంగ్రెస్ పేటెంటే అంటూ గప్పాలు కొట్టుకోవడం సిగ్గుచేటు అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కాదు, మా కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే కోటి 53 లక్షల టన్నుల వరి పండిందని గొప్పలు చెప్పుకోవడం నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్లు ఉందన్నారు. మీరు చెప్పిన ప్రాజెక్టులు 2014లో కూడా ఉన్నాయి. మరి అప్పుడు 68 లక్షల టన్నుల వరి మాత్రమే ఎందుకు పండింది రేవంత్ రెడ్డి? చెప్పాలన్నారు.

ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి అని ప్రశ్నించారు. కేసీఆర్ కి గజ్వెల్ లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా? అని సవాల్ విసిరారు. నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా?, ఇప్పటికే నీకు కాంగ్రెస్ తత్వం బోధపడినట్లుంది. మల్లా అవకాశం వస్తదా? వస్తదా? అని భయపడుతున్నవు అన్నారు. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావు రేవంత్ రెడ్డి…..మేము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నం అన్నారు. మీ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదు… అబద్దాలు చెబుతూ ఏడాది నడిపించావు. ఈ అబద్దాలతో ఇంకా ఎంతో కాలం మోసం చేయలేవు అన్నారు. అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం… అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా? చెప్పాలన్నారు.

Also Read:Bigg Boss 8 Telugu:బిగ్ షాక్ ఇచ్చిన బిగ్ బాస్

- Advertisement -