రంగనాయక సాగర్ దగ్గర ఇరిగేషన్ భూములను కబ్జా చేశానని నాపై రేవంత్ రెడ్డి తప్పుడు ఆరోపణ చేశారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. మీడియాతో మాట్లాడిన హరీశ్..పచ్చకామెర్ల రోగికి లోకమంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్లు కబ్జాలు చేసే చరిత్ర నీది అని దుయ్యబట్టారు.
రైతుల పట్టా భూములను ధరణి ద్వారా 13 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసి కొనడం జరిగిందన్నారు. ఒక గుంట కాని, ఒక ఎకరా కాని ఇరిగేషన్ భూమి కాని, ప్రభుత్వ భూమి కాని తీసుకున్నట్టు నా చరిత్రలో లేదు.. ఏ భూమిని అయితే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నానో ఆ భూమిలోనే నేను ఉన్నాను అని చెప్పారు.
నువ్వు ఎప్పుడు వస్తావో చెప్పు రేవంత్ రెడ్డి. నీ సమక్షంలోనే సర్వే చేద్దాం…రేవంత్ నువ్వు ఎన్ని బ్లాక్ మెయిల్స్ చేసినా భయపడేది లేదు.. BRS పార్టీ తరపున, రైతుల పక్షాన నిన్ను ప్రశ్నిస్తూనే ఉంటాం అని హరీశ్ రావు.
కేసీఆర్ మొక్క పీకేస్తా అన్న మొనగాడివి.. ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకు భయపడుతున్నావు అని మండిపడ్డారు ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు. నువ్వు నిత్యం కేసీఆర్ జపం చేసేది చూస్తే నీ కింద సెగ అంటుకున్నదని అర్థం అవుతుంది.. నీ భయం, నీ వణుకుడు ప్రారంభమైందన్నారు. నీకు తోచిన సెక్షన్లు అన్ని పెట్టుకో మేము మాత్రం ఆగేది లేదు.. మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, నమ్మకం ఉంది, వెంటనే ఈరోజే హైకోర్టులో ధరఖాస్తు చేస్తున్నామన్నారు.
Also Read:ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం