Harishrao:రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తా?

26
- Advertisement -

ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సంగారెడ్డిలో మీడియాతో మాట్లాడిన హరీష్..ఆగస్టు 15 లోగా రుణమాఫీ చేయకపోతే మీరు సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? అని సవాల్ విసిరారు.

సీఎం రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించిన హరీష్ రావు.. సీఎం సవాల్‌ను నేను స్వీకరిస్తున్నా. అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చేలా చేసే బాధ్యత ప్రతిపక్షంగా మాపై ఉంది అన్నారు. ఎల్లుండి అసెంబ్లీ ముందు అమరవీరుల స్తూపం దగ్గరికి నేను వస్తా. ఆగస్టు 15 లోపు మీరు ఇచ్చిన అన్ని గ్యారెంటీలు అమలు చేస్తానని ప్రమాణం చెయ్యి. ఆగస్టు 15 లోపు పూర్తిగా రుణమాఫీ చెయ్యాలి. ఒకవేళ రుణమాఫీ చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్ళీ ఉప ఎన్నికల్లో కూడా పోటీ చేయను. రుణమాఫీ చెయ్యక పోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా..? ప్రశ్నించారు.

గతంలో కొడంగల్‌లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకంలో మహిళలకు రూ.2,500 ఎందుకు ఇవ్వలేదు..? రైతులకు ఎకరానికి రైతు బంధు రూ.15,000 సహాయం ఎందుకు ఇవ్వలేదు..? ధాన్యానికి రూ.500 బోనస్ ఏది..? నిరుద్యోగులకు భృతి ఏదీ..? బీఆర్‌ఎస్‌ పార్టీ అంటే భయం ఎందుకు..?అని ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read:KTR:మరోసారి కాంగ్రెస్‌ను నమ్మితే భంగపాటే

- Advertisement -