రేవంత్ రెడ్డి ఇచ్చింది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కాదు కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు 50 ఏళ్లుగా చేసిన మోసాలకు కవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణ అనంతరం మాట్లాడారు హరీష్.
కాళేశ్వరంపై మా హయాంలో జరిగిన కేబినెట్ నోట్, డిపార్ట్మెంట్‌కు సంబంధించిన సమాచారం కావాలని చీఫ్ సెక్రటరీకి, జీఏడీ సెక్రటరీకి, ఇరిగేషన్ సెక్రటరీకి లేఖ రాశాను.. కానీ వారి నుండి స్పందన రావడం లేదు అన్నారు.
మా దగ్గర ఉన్న పూర్తి సమాచారం ప్రకారం.. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి 6 సార్లు కేబినెట్‌లో ఆమోదం, 3 సార్లు శాసన సభలో ఆమోదం పొందిన అన్ని పేపర్లు కమిషన్‌కు అందించాను అని తెలిపారు. కృష్ణా నదిలో 763 టీఎంసీలు కావాలని కేసీఆర్ పోరాటం చేశాడు .. మన లాయర్లు, అధికారులు 763 టీఎంసీల కోసం కోట్లాడుతుంటే, రేవంత్ రెడ్డి 500 టీఎంసీలు చాలు అంటుండు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో 563 టీఎంసీలు చాలు అంటుండు అన్నారు. మీరు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ తో మాట్లాడి విషయ పరిజ్ఞానం పెంచుకొని తరువాత మీడియా ముందు మాట్లాడండి అని సూచించారు హరీష్.
Also Read:బీసీ రిజర్వేషన్లు..చిత్తశుద్ది నిరూపించుకోవాలి

