రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టబోతుందని…వరుసగా మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు. టీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడిన హరీష్…సీఎం నేతృత్వంలో హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీ మార్చామని చెప్పారు.
కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రంలో కరువుగానీ, కర్ఫ్యూలుగానీ లేవని, కాబట్టి ప్రజలు మరోసారి బీఆర్‌ఎస్ పార్టీని గెలిపించబోతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోను కాపీ కొట్టిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి గతంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చని చరిత్ర ఉందని విమర్శించారు.రాష్ట్ర సంపద బాగా పెరిగిందని, అప్పులలో తెలంగాణ రాష్ట్రం కింద నుంచి ఐదో రాష్ట్రంగా ఉన్నదని మంత్రి తెలిపారు.
కేసీఆర్‌ను ఓడించడానికి రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటయ్యాయని…ఆ రెండు పార్టీలకు రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో దేశంలో ప్రాంతీయ పార్టీలదే హవా కొనసాగుతుందని…కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు.
Also Read:BJP:బీజేపీలో కోవర్ట్ రాజకీయం?