సీఎం కేసీఆర్ అంటే నమ్మకం, విశ్వాసం అన్నారు మంత్రి హరీశ్ రావు. బోధన్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడిన హరీశ్..ప్రజల ఆశీర్వాదంతో బోధన్ లో షకీల్, రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టబోతున్నారన్నారు.కేసీఆర్ వచ్చిన తర్వాతనే అభివృద్ధి, సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయన్నారు. నేను ఇరిగేషన్ మంత్రిగా ఉన్నప్పుడు కెనాల్ లైనింగ్, ఆధునీకరణ కావాలని అడిగితే వందల కోట్ల రూపాయలను మంజూరు చేశాం అన్నారు.
బోధన్ కాంగ్రెస్ అభ్యర్ధి సుదర్శన్ రెడ్డి ఇరిగేషన్ శాఖా మంత్రిగా ఉండి చేయలేని పనిని ఎమ్మెల్యేగా షకీల్ భాయి చేసి చూపించాడన్నారు. తాగు నీళ్లు ఇచ్చి, చిట్టచివరి ఆయకట్టు వరకు నిజాం సాగర్ నీళ్లను పారించాడని…కాంగ్రెస్ హయాంలో చేయలేని బోధన్ – నిజామాబాద్ నాలుగు వరుసల రహదారిని రూ. 30 కోట్లతో షకీల్ భాయి సాధించారన్నారు.నవీపేటలో 60 కోట్ల రూపాయలతో పాలిటెక్నిక్ భవనాన్ని బీఆర్ఎస్ హయాంలో నిర్మించుకున్నాం అని…ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన బాసరకు జాన్కం పేట నుంచి నాలుగు వరుసల రహదారిని 55 కోట్ల రూపాయలతో బీఆర్ఎస్ ప్రభుత్వం అండతో ఎమ్మెల్యే షకీల్ నేతృత్వంలో నిర్మించుకున్నాం అన్నారు.
తెలంగాణ రాక ముందు వచ్చిన తర్వాత జరిగిన మార్పును ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోని నమ్మొద్దు. కర్ణాటకలో ఇలాంటి హామీలిచ్చి ప్రజలను మోసం చేశారు. అక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇస్తామని చెప్పి కేవలం 3 గంటలే ఇస్తున్నారన్నారు.కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు. రేవంత్ రెడ్డి మూడు గంటలు చాలు అంటడు. మూడు గంటల్లో 3 ఎకరాలు పారుతదా?…రైతు బంధు, రైతు బీమా, నిరంతర విద్యుత్, ధాన్యం కొనుగోలు చేసింది కేసీఆర్ కాదా ఆలోచించాలన్నారు. కాంగ్రెస్ మాయమాటలకు మోసపోకండి…కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత 200 పెన్షన్ ని 2 వేలు చేసిండు. ఈ సారి గెలిపిస్తే 5 వేలు చేస్తడన్నారు.
Also Read:KTR:ఓటు వేయండి..అది మీ బాధ్యత