ప్రశ్నోత్తరాల సమయం లేకుండా చేశారు?: హరీష్

3
- Advertisement -

హెచ్ఎండీఏ భూములు తాకట్టు పెట్టి 20 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధం అవుతున్నారు… గతంలో టిజి ఐసీసీ కుదవబెట్టి 10 వేల కోట్లు అప్పు తెచ్చిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఆస్తులు కుదవ బెట్టి అప్పులు తెచ్చారు… జిహెచ్ఎంసి నుండి కూడా అప్పులు తెచ్చారు అన్నారు. నిన్న ఈ కార్పొరేషన్ ల నుండి అప్పులు తెచ్చారు అని నిన్న కొశ్చన్ అవర్ లో ప్రశ్న ఉండేది… ఈ ప్రశ్న రాకుండా అడ్డుకున్నారు అన్నారు.

ఎంఐఎం వాళ్ళది కూడా ఒక్క ప్రశ్న ఉండే… ఈ ప్రభుత్వం వచ్చాక జీవో లు సైట్ లో పెట్టడం లేదు, ఇవాళ మావి ముఖ్యమైన మూడు ప్రశ్నలు ఉండే… యాసంగి పంటలు ఎండిపోతున్నాయి అని మా కేటీఆర్ ది 2వ ప్రశ్న ఉండే, ప్రాజెక్టు ల కింద పంటలు ఎండిపోతున్నాయి అంటే అది మా ప్రభుత్వందే బాధ్యత అని నిన్న నీటిపారుదల శాఖ అన్నారు.

మరి ఇవాళ దేవాదుల కింద వందల ఎకరాల పంట ఎండిపోయింది… ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఇవాళ ప్రాజెక్టు లలో నీళ్లు లేవు అన్నారు. నిన్న ఎత్తిపోవడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా ఇవాళ లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నాయి.. మూడవ ప్రశ్న వడ్ల కొనుగోలు మీద మా పల్లా రాజేశ్వర్ రెడ్డి ఉం, వడ్ల కొనుగోలు లో మేము 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొన్నాం అన్నారు… గతంలో మేము అధికారం లో ఉన్నప్పుడు 74 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేశాం అన్నారు.

54 లక్షల మెట్రిక్ టన్నుల సన్న వరి ధాన్యం కొనుగోలు చేశాం అన్నారు… వరి కొనుగోలు,సన్న వరి ధాన్యం,రైతు భరోసా అన్నింటిలో ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు. వరంగల్ జిల్లాలో ఇవాళ లక్షల ఎకరాల్లో పంట ఎండింది.. పాలమూరు జిల్లాలో ఎండుతుంది అన్నారు. మల్లన్న సాగర్ లో నీళ్లు ఉండి పంటలకు నీళ్లు ఇవ్వడం లేదు… ఇవాళ కొశ్చన్ అవర్ ఎందుకు క్యాన్సల్ చేశారు చెప్పాలన్నారు.

శాసన సభ వ్యవహారాల మంత్రిని అడుగుతున్న.. కొశ్చన్ అవర్ ను ఎదుర్కోలేక మా ప్రశ్నలకు సమాధానం లేక కొశ్చన్ అవర్ క్యాన్సల్ చేశారు అన్నారు. నిన్న స్పీకర్ తో కూడా మాట్లాడను…హడావుడి చేసి కొశ్చన్ అవర్ లేకుండా చేశారు అన్నారు. మా కొశ్చన్ లకు సమాధానం చెప్పలేక ఇలా క్యాన్సల్ చేయడం ఏంటి.. కొశ్చన్ అవర్ మ్యాండేటరీ….జీరో అవర్ పెట్టిన పెట్టకపోయిన కొశ్చన్ అవర్ పెట్టాలి అనని డిమాండ్ చేశారు హరీష్ రావు.

Also Read:ప్రధానికి సీఎం రేవంత్ రెడ్డి లేఖ

- Advertisement -