Harish:బీజేపీకి ఓటేస్తే నీళ్లు లేని బావిలో పడ్డట్లే

14
- Advertisement -

బీజేపీకి పొరపాటున ఓటేస్తే నీళ్లు లేని బావిలో పడ్డట్లేనన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా గజ్వేల్‌ పట్టణంలో హరీశ్‌ రావు రోడ్‌షో నిర్వహించారు. రైతులు, మహిళలు, పేదలందరినీ కాంగ్రెస్‌ మోసం చేసిందని చెప్పారు.

కల్యాణలక్ష్మి కింద రూ.లక్షతోపాటు తులం బంగారం ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. మహిళలకు బంగారం ఇవ్వడం ఏమోకానీ బంగారం ధరలు కొండెక్కాయన్నారు. కాంగ్రెస్‌ వచ్చిన తర్వాత కేసీఆర్‌ కిట్‌ బంద్‌ అయ్యిందని విమర్శించారు. బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని విమర్శించారు. గజ్వేల్‌లో ఏ ముఖం పెట్టుకుని బీజేపీ వాళ్లు ఓట్లు అడుతున్నారని ప్రశ్నించారు. దుబ్బాకలో చెల్లని రూపాయి.. ఇక్కడ చెల్లుతుందా అని ఎద్దేవా చేశారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో సమయానికి రైతుబంధు ఇచ్చామని … కాంగ్రెస్‌ పాలనలో మోటర్లు కాలిపోతున్నాయని గుర్తు చేశారు.

Also Read:వెన్నెల కిశోర్..OMG టీజర్

- Advertisement -