జల్సాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రజా భవన్‌

4
- Advertisement -

జల్సాలకు కేరాఫ్ అడ్రస్‌గా ప్రజాభవన్‌ను మార్చారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్‌ రావు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన హరీష్‌.. సీఎం రేవంత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజా భవన్‌ను పూర్తిగా జల్సాలకు, విందులకు, వినోదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేశారని ఆయన ఆరోపించారు. “ఉదయం బ్రేక్‌ఫాస్ట్ మీటింగులు, మధ్యాహ్నం సెటిల్‌మెంట్లు, సాయంత్రం గానా భజానాలు, సంగీత్‌లు, ఎంగేజ్‌మెంట్లు, విందులు–ఇలా ప్రజా భవన్ ఇప్పుడు ఉత్సవాల కేంద్రంగా మారిపోయింది. కానీ ప్రజల సమస్యలు మాత్రం అటెన్షన్‌లోనే లేవు” అని తీవ్రంగా మండిపడ్డారు.

కరీంనగర్‌కు చెందిన రైతు గొడుగు నాగరాజు ఉదాహరణగా చూపుతూ, “ఆ రైతు ప్రజా భవన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. అతని ఫోన్‌కు సమస్య పరిష్కారమైంది అని మెసేజ్ కూడా వచ్చింది. కానీ అసలు సమస్య మాత్రం ఇప్పటికీ అదే ఉంది. ఇది ప్రజాబవన్ పనితీరునా?” అని ప్రశ్నించారు.

రేవంత్ రెడ్డి “ప్రజా దర్బార్” పై కూడా హరీష్ రావు దుమ్మెత్తిపోశారు. సీఎం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆయన ఒక్క రోజు మాత్రమే ప్రజా దర్బార్‌కు వచ్చాడు. మంత్రులు నాలుగు–ఐదు రోజులు కనిపించారు. ఆ తర్వాత వీళ్లెవరూ కనిపించడంలేదు. ప్రజలు వేసిన దరఖాస్తులను పట్టించుకునే నాదుడే లేడు అని విమర్శించారు.

మేనిఫెస్టోలో మొదటి హామీ, రేవంత్ రెడ్డి చెప్పిన మొదటి మాటే విఫలమైందని హరీష్ రావు ఎద్దేవా చేశారు. ప్రజల సమస్యలపై దృష్టిపెట్టాలని, ప్రచారపు కార్యక్రమాలకే పరిమితమవ్వకూడదని ఆయన సూచించారు.

Also Read:శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు బాంబు బెదిరింపు

- Advertisement -