కాంగ్రెస్ ద్వంద్వ నీతిపై హరీష్‌ ఫైర్

9
- Advertisement -

కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ నీతిపై మాజీ మంత్రి హరీష్‌ రావు మండిపడ్డారు. ఆధారాలతో సహా కాంగ్రెస్ పార్టీని ఎండగట్టారు. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు.

30-03-2016న ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో ఆడియో–విజువల్ ప్రెజెంటేషన్ నిర్వహిస్తే, అది భారత దేశ పార్లమెంట్ సంప్రదాయాలకు విరుద్ధం. అందుకే మేము సభకు హాజరుకాబోము అని లేఖ రాశాడు.

నేడు మంత్రి హోదాలో ఉండి అసెంబ్లీ హాల్లో ప్రెజెంటేషన్‌కు సిద్ధపడటం, రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు. ఈ ఉత్తరంపై ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా సంతకం చేశాడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు, రాజ్యాంగం, పార్లమెంట్ స్పూర్తి లాంటి మాటలు అంటూ.. అధికారంలోకి రాగానే అదే విలువలకు తిలోదకాలు ఇస్తారు. ఇదే కాంగ్రెస్ పార్టీ అసలు నైజం అని హరీష్ రావు ఆరోపించారు.

Also Read:మూసీ కన్నా..రేవంత్ భాషే కంపుకొడుతోంది!

- Advertisement -