కాంగ్రెస్ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారింది.రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక విధానాలతో రైతులు నరకం చూస్తున్నారు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. సిద్దిపేటలో మాట్లాడిన హరీష్.. రేవంత్ రెడ్డి గారూ.. నిన్ననే మీరు పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని, ఖానాపూర్ మండలం, ధర్మరావు పేట గ్రామంలో యూరియా కోసం రైతులు పడుతున్నఅగచాట్లు ఇవి అన్నారు.
రైతులకు యూరియా సరఫరా చేయడం చేతగాని రేవంత్ రెడ్డి, నిన్న ఉత్తర కుమార ప్రగల్భాలు పలికిండు. విజయోత్సవాల పేరిట ప్రభుత్వ ధనం దుబారా చేస్తూ.. చేసింది లేక, చెప్పకునేది లేక గప్పాలు కొట్టిండు…గ్లోబల్ సమ్మిట్ అంటూ, విజన్ 2047 అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న రేవంత్ రెడ్డి, ముందు రైతులకు యూరియా సరఫరా చేయడంపై దృష్టి సారించు అన్నారు.
వ్యవసాయ ప్రణాళికను గాలికి వదలి రైతులు, మహిళలు, వృద్దులు అందర్నీయూరియా కోసం గంటల కొద్దీ క్యూ లైన్లలో నిలబెడే పరిస్థితి తెచ్చావు. మీ దుర్మార్గ పాలన రైతుల పాలిట శాపంగా మారింది. మీ రైతు వ్యతిరేక విధానాతో రైతులు నరకం చూస్తున్నారు.గత సీజన్ యూరియా కష్టాలు, చేదు అనుభవాల నుంచి మీరు, మీ ప్రభుత్వం ఏం నేర్చుకోకపోవడం సిగ్గుచేటు.
సీజన్ ప్రారంభంలోనే పరిస్థితి ఇలా ఉంటే, మున్ముందు పరిస్థితి ఇంకా ఎంత దారుణంగా ఉంటుంది? యూరియా కొరత రాకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
Also Read:BB9:కళ్యాణ్‌పై నోరుజారిన భరణి!

