కృష్ణ జలాల కోసం పోరాడింది బీఆర్ఎస్ పార్టీ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అసెంబ్లీ లాబీలో చిట్‌చాట్‌గా మాట్లాడిన హరీష్.. పోతిరెడ్డి పాడు పై 40 రోజులు కోట్లాడాం అన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి తనకు మంత్రి పదవి ఇస్తారని పెదవులు మూసుకున్నాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. పదవుల కోసం పెదవులు మూసుకున్నాడు ఉత్తమ్.. మేము తెలంగాణ హక్కుల కోసం పదవులు వదులుకున్న చరిత్ర మాది అన్నారు.
ద్రోహ చరిత్ర ఉత్తమ్ ది.. సెక్షన్ 3 తీసుకొచ్చింది కేసిఆర్, కృష్ణా జలాల కోసం పోరాడింది మేము అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను వ్యతిరేకించింది బీ ఆర్ ఎస్…కృష్ణ నది పరివాహక ప్రాంతాల్లో పంటలు ఎండడానికి కారణం కాంగ్రెస్ అన్నారు. వీరి చేతగాని తనం వల్ల పంటలు ఎండిపోతున్నాయి.. ఉత్తమ్ తప్పులు మాట్లాడి, సభను తప్పు దోవ పట్టించారు అన్నారు.
Slbc గురించి నాడు కాంగ్రెస్ నేతలు మాట్లాడలేదు… పులిచింతల నిర్వాసితులకు మేము సహాయం చేశాం అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన నాయకుడు కేసిఆర్ పై సీఎం చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బాయ్‌కాట్ చేశామని చెప్పారు. స్పీకర్ మైక్ ఇవ్వలేదు… ముఖ్యమంత్రి క్షమాపణ కోరాలని కోరాం అన్నారు. సభలో ప్రతి పక్ష నాయకుడు కేసిఆర్.. విజ్ఞత సంస్కారం లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడారు అన్నారు.
ఇంత నీచపు మాటలు మాట్లాడే సిఎంను చూడలేదు.. ఉత్తమ్ కుమార్ పచ్చి అబద్దాలు మాట్లాడారు అన్నారు. కృష్ణ జలాలలో అన్యాయనికి కారణం కాంగ్రెస్ పార్టీ..విద్యాసాగర్ వెళ్లి తాత్కాలికంగా ఒప్పందం చేసుకున్నారు అన్నారు. అప్పుడు ప్రాజెక్టు లు లేక 299 tmc ఒప్పందం .. ఒక్క సంవత్సరానికి అప్పడు ఒప్పందం చేసుకున్నారు అన్నారు. మరి తెలంగాణ అధికారులు ఈ సంవత్సరం ఎందుకు ఒప్పుకున్నారు.. పోతిరెడ్డిపాడు కోసం 40 రోజులు అప్పడు అసెంబ్లీ ని స్తంభింపజేసింది మేము అన్నారు.
Also Read:ప్రజాపాలన కాదు..ప్రజలను వేధించే పాలన: కేటీఆర్
పదవుల ఉత్తమ్ పెదవులు మూసకున్నారు… తెలంగాణకి ద్రోహం చేసి ఉత్తమ్ మంత్రి అయ్యారు అన్నారు. రాయలసీమ పై స్టే తెచ్చింది బీ ఆర్ ఎస్… ఉత్తమ్ కుమార్ రెడ్డి, వారి సతీమణి చంద్రబాబు వద్ద భోజనం చేసి కృష్ణ నీటిని అప్పగించారు అన్నారు.