సీఎం రేవంత్ చెప్పేవన్ని అబద్దాలే:హరీష్

6
- Advertisement -

మల్లన్న సాగర్ కట్టొద్దని 2016లో రేవంత్ రెడ్డి దీక్ష చేశాడు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మీడియాతో మాట్లాడిన హరీష్… 2009లో రాజశేఖర్ రెడ్డి మల్లన్న సాగర్ కడితే, 2016లో రేవంత్ రెడ్డి దీక్ష ఎందుకు చేశాడు మరి? అని ప్రశ్నించారు. మల్లన్న సాగర్ కడితే కేసీఆర్‌కి మంచి పేరు వస్తుందని రేవంత్ రెడ్డి 48 రోజులు దీక్ష చేసి, రైతులను రెచ్చగొట్టి అడ్డుపడ్డాడు అన్నారు.

కానీ మేము రైతులను ఒప్పించి, మెప్పించి 99% మంది రైతులు ఇష్టపూర్వకంగా మల్లన్న సాగర్‌కి భూములు ఇచ్చారు… మా హయంలో మల్లన్న సాగర్‌లో నష్టపోయిన బాధితులకు శాశ్వత అమ్ముకునే హక్కు కలిగే 250 గజాల స్థలంలో డబుల్ బెడ్ రూం ఇల్లు కట్టించి ఇచ్చాం.. 18 ఏండ్లు దాటిన ప్రతి మనిషికి రూ.7.5 లక్షలు ఆర్&ఆర్ ప్యాకేజీ ఇచ్చాం అన్నారు.

అదే రేవంత్ రెడ్డి మూసీలో ఇండ్లు కోల్పోయిన వారికి కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూం ఇండ్లు అసైన్మెంట్ ఇచ్చి.. రూ.25 వేల చెక్కు ఇచ్చాడు… ఆ తోవ ఖర్చుకు ఇచ్చిన రూ.25 వేల చెక్కు కూడా బౌన్స్ అయ్యిందని బాదితులు గగ్గోలు పెడుతున్నారు అన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు అసలు కాంగ్రెస్ హయాంలో పూర్తి కాలేదు..బీఆర్ఎస్ వచ్చిన తర్వాత రూ.2052 కోట్ల ఖర్చు పెట్టి 2016లో ఆ ప్రాజెక్టును పూర్తి చేసి 20 టీఎంసీల నీళ్లు నింపాము అన్నారు.

Also Read:ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025

కానీ పని చేసిన తర్వాత మీ లాగా పోయి రిబ్బన్లు కట్ చేయలేదు – హరీష్ రావు రేవంత్ రెడ్డి నిన్న కొబ్బరికాయ కొట్టిన గండిపేటకు వచ్చే నీళ్లు కాళేశ్వరం నీళ్లు… కాళేశ్వరంలో భాగమైన 15 రిజర్వాయర్లలో భాగమైన మల్లన్న సాగర్ నుండి వచ్చే నీళ్లు గండిపేటకు వస్తున్నాయి అన్నారు. కాళేశ్వరం కూలిపోయిందని అబద్ధాలు చెప్పి, నిన్న అదే కాళేశ్వరం నీళ్ల ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశాడు …అసలు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు ప్రతిపాదనలో మల్లన్న సాగర్ లేదు…ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు డీపీఆర్‌ను సీడబ్యూసీ తిప్పి పంపింది అన్నారు.

- Advertisement -