ఈనెల 26వ తేదీన దివ్యాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మహాధర్నా కార్యక్రమానికి రావాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావు ని హైదరాబాద్ నివాసంలో కలిసి కోరారు దివ్యాంగుల పోరాట సమితి ప్రతినిధులు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులకు 4000 పెన్షన్ ను 6000కు పెంచుతామని హామీ ఇచ్చి అధికారంలో కూర్చున్న కాంగ్రెస్ పార్టీ సంవత్సరకాలం గడుస్తున్నా ఇప్పటివరకు నెరవేర్చకపోవడం దుర్మార్గమని, పెన్షన్ పెంపుతో పాటు తమ 11 డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని అందుకు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మద్దతు ఇవ్వాలని కోరిన దివ్యాంగుల పోరాట సమితి ప్రతినిధులు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ : దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం ఆలోచించిన ఏకైక నాయకుడు కేసీఆర్ గారు. 500 రూపాయలను పెన్షన్ ని 4000 వేలు చేసి దివ్యాంగుల ఆత్మవిశ్వాసాన్ని పెంచారు. ఎన్నికల్లో 3000 రూపాయల పెన్షన్ చేస్తామని హామీ ఇచ్చి 4000 రూపాయలు పెన్షన్ ఇచ్చి దివ్యాంగులపై తన ప్రేమను చాటుకున్నారు కేసీఆర్ అన్నారు.
దేశంలో దివ్యాంగులకు 4000 వేల రూపాయల పెన్షన్ ఇచ్చిన ఏకైక నాయకుడు కేసిఆర్, ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో దివ్యాంగుల పాత్ర కూడా ఉండాలని కెసిఆర్ గారు అందుకు అనుగుణంగా ప్రోత్సహించారు…కుటుంబాలకు దివ్యాంగులు భారం కాదని బలమని కెసిఆర్ గారు నిరూపించారు. 4000 రూపాయల పెన్షన్ అందించడంతోపాటు విద్యా ఉపాధి అవకాశాల్లో మెరుగైన అవకాశాలను కల్పించారు అన్నారు.
అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసినట్టే దివ్యాంగులను కూడా నమ్మించి మోసం చేసింది కాంగ్రెస్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 పెన్షన్ 6000 చేస్తామని నమ్మించి సంవత్సరం కాలం పూర్తవుతున్నా కనీసం వారి గురించి మాట్లాడకపోవడం శోచనీయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు దివ్యాంగుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది.. మీ డిమాండ్లకు బిఆర్ఎస్ పక్షాన మద్దతు ఇవ్వడంతో పాటు అసెంబ్లీ సమావేశాల్లో పెన్షన్ పెంపుతో పాటు 11 డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నారు. ఈనెల 26వ తేదీన నిర్వహిస్తున్న చేయూత పెన్షన్ దారుల మహాధర్నా కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన పూర్తి మద్దతు తెలుపుతున్నామన్నారు.
Also Read:KTR: రైతుభరోసాకు ఎగనామం..రుణమాఫీ పేరుతో కనికట్టు
డిమాండ్లు:
1. దివ్యాంగుల పెన్షన్ 4016 నుంచి 6000/- రూ॥లకు పెంచాలి. వృద్ధులు, వితంతువులు ఇతర చేయూత పెన్షన్లు 2016 నుంచి 4000లకు, కండరాల క్షీణత వారికి 15000 పెన్షన్ ప్రతినెల 5వ తారీఖు లోపు ఇవ్వాలి.
2. శారీరక వికలాంగుల రోస్టర్ 56ను, బధితరుల రోస్టర్ 31ను 10 లోపు మార్చి బ్యాక్ లాగ్ ఉద్యోగాలు భర్తీ చేయాలి. అన్ని ప్రభుత్వ రంగాలలో 4% రిజర్వేషన్ కల్పించాలి. ఉన్నత విద్యా రంగాలలో 4% రిజర్వేషన్ కల్పించాలి.
3. దివ్యాంగుల హక్కుల చట్టం -2016ను రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేయాలి.
4. దివ్యాంగుల సంక్షేమ శాఖను స్వతంత్రంగా ఉంచుతూ 02.12.2022 నాటి జి.ఓ.నెం.34ను తక్షణమే అమలు చేయాలి.
5. దివ్యాంగులకు ఆర్.టి.సి. బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలి.
6. దివ్యాంగుల సహకార సంస్థలో ఉద్యోగులకు పెండింగ్ పి.ఆర్.సి. ఇవ్వాలి. సంస్థ ఐలోపేతానికి జి.ఓ.నెం.39 రద్దు చేయాలి. సంస్థలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలి.
7. దివ్యాంగులకు పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు 5% రాజకీయ రిజర్వేషన్ కల్పించాలి.
8. రాష్ట్ర బడ్జెట్లో దివ్యాంగుల సంక్షేమానికి 5% నిధులు కేటాయించాలి.
9. వికలాంగులైన ఉద్యోగస్థులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ 3% నుండి 4%కి ఓపెంచాలి. స్పెషల్ సి.ఎల్. 14కు పెంచాలి. దివ్యాంగుల ఉద్యోగస్థులకు ఇచ్చే స్పెషల్ అలవెన్స్ 3000 నుంచి 6000 వరకు పెంచాలి.
10. ఐ.కె..సి ఆధ్వర్యంలో నడుస్తున్న దివ్యాంగుల మనోవికాస కేంద్రాల సిబ్బందికి హెచ్.ఆర్.పాలసీ కల్పించాలి.
11. చదువుతో సంబంధం లేకుండా వికలాంగులందరికీ మోటర్ వాహనాలు, బధిరులకు మొబైల్ ఫోన్స్, అంధులకు లాప్ టాప్, కుష్టువ్యాధిగ్రస్తులకు చెప్పులు, వికలాంగుల సహకార సంస్థ ద్వారా దివ్యాంగులందరికి స్వయం ఉపాధి క్రింద 10 లక్షల వరకు రుణం అందివ్వాలి.