రాష్ట్రానికి క్యాన్సర్ సోకిందంటూ రేవంత్ రెడ్డి ఓ ఉన్మాదిలా మాట్లాడుతున్నారు అని మండిపడ్డారు మాజీ మంత్రి హరీశ్ రావు. పొలిటికల్ మెచూరిటీ లేకనే సీఎం మార్చురీ వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష నేతల మరణాన్ని కోరుకుంటున్న నీచ బుద్ది రేవంత్ రెడ్డిది అన్నారు. బిఆర్ఎస్ లక్షా 62 వేల ఉద్యోగాలు ఇస్తే, కాంగ్రెస్ 5 వేల ఉద్యోగాలు ఇవ్వలేదు అన్నారు.
ప్రభుత్వ కార్యక్రమాలను సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ విమర్శలకు వాడుకోవడం ఆయన దుస్థితి కి నిదర్శనం .. ఉద్యోగ నియామక పత్రాలిచ్చే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తన ఉన్మాద ప్రవృత్తిని మరోసారి బయట పెట్టుకున్నారు అన్నారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చుకుంటూ ఇంకెంత కాలం డప్పు కొట్టుకుంటావు రేవంత్ రెడ్డి? అని ప్రశ్నించారు.
ఏడాదిన్నరగా నువ్వు ఇస్తున్న నియామక పత్రాలు అన్ని కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లె కదా.. ఈరోజు కూడా కేసీఆర్ ప్రభుత్వ హయంలో ఇచ్చిన పాలిటెక్నిక్ లెక్చరర్, జూనియర్ లెక్చరర్ నోటిఫికేషన్లకు, పెట్టిన పరీక్షలకు నియాక పత్రాలు ఇచ్చినవు చెప్పాలన్నారు. కేసీఆర్ హయాంలో మొదలై చివరి దశకు వచ్చిన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ను పూర్తి చేసి జబ్బలు చరచుకుంటే బొప్పి కట్టడం తప్ప ఒరిగేదేమి ఉండదు.. తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలో బి ఆర్ ఎస్ ప్రభుత్వం లక్షా 62 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది వాస్తవం అన్నారు.
Also Read:అసమర్ధుడి పాలనలో తెలంగాణ అల్లకల్లోలం: కేటీఆర్
ఏడాదిన్నర కాలంలో నోటిఫికేషన్ల ద్వారా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఉద్యోగాలు 5, 6 వేలు మించ లేదనేది వాస్తవం.. 95% ఉద్యోగాలు స్థానిక యువతకు దక్కేలా కేసీఆర్ గారు రాష్ట్రపతి ఉత్తర్వులు సాధించారు అన్నారు. ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, హామీల అమలులో అట్టర్ ఫ్లాప్ అయ్యింది.. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు బోగస్ అయ్యింది, జాబ్ క్యాలెండర్ జాబ్ లెస్ క్యాలెండర్ అయింది, నిరుద్యోగ భృతి తీవ్ర నిరాశను మిగిల్చింది అన్నారు.
రేవంత్ లాంటి కుసంస్కారి కేసీఆర్ పై చిల్లర విషయాలు చెబితే నమ్మడానికి ఉద్యోగాలు పొందిన వారు అమాయకులు కారు, 55 వేల ఉద్యోగాలిచ్చామని చెప్పిన అబద్ధాన్నే ప్రతి చోటా చెబుతూ రేవంత్ తుపాకీ రాముడిని మించిపోయారు .. పాలన చేతకాక రేవంత్ ‘పరనింద”నే పనిగా పెట్టుకున్నారు అన్నారు. సీఎం గా వచ్చిన అవకాశాన్ని రాష్ట్రం బాగు కోసం వాడక తన పదవి ఉంటుందో ఊడుతుందోనని అభద్రతా భావం తో మాట్లాడుతున్నారు.. తన పార్టీలోని అంతర్గత కుమ్ములాటలతో సతమతమవుతూ బీ ఆర్ ఎస్ పై నెపం నెట్టి సానుభూతి రాజకీయానికి తెర లేపుతున్నారు.. హంతకుడు సంతాప సభ పెట్టినట్టు ఉంది రేవంత్ తీరు అన్నారు.

