సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా? అని ఎక్స్ వేదికగా మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన చెప్పాలని డిమాండ్ చేశారు.
సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా?..నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు? ,నేడు ఖానాపూర్ లో వృద్ద రైతు మెడలు పట్టి గెంటేశారు? అని దుయ్యబట్టారు.
ఎద్దేడ్చిన ఎవుసం, రైతేడ్చిన రాజ్యం బాగుపదడదన్న సంగతి మరిచిపోయి ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం..రైతు పై చేయి వేసిన పోలీసు పై వెంటనే తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలని, బేషరతుగా యావత్ తెలంగాణ రైతు లోకానికి కాంగ్రెస్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
సమస్య చెప్పుకునేందుకు తహశీల్దార్ కార్యాలయంకు వెళ్లిన వృద్ధ రైతు పట్ల
ఇంత కర్కశంగా వ్యవహరిస్తారా?ఇదేనా మీరు చెబుతున్న ప్రజా పాలన @revanth_anumula ?
సీఎం ఆదేశాలతో ఇంత అత్యుత్సాహం ప్రదర్శించడం పోలీసులకు అవసరమా?
నాడు లగచర్ల లంబాడి రైతన్నల చేతులకు బేడీలు వేశారు?
నేడు ఖానాపూర్… pic.twitter.com/5VsvKDfZSP— Harish Rao Thanneeru (@BRSHarish) June 4, 2025
Also Read:కట్టప్ప జడ్జిమెంట్..రిలీజ్ డేట్ ఫిక్స్

