కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 18 నెలల వ్యవధిలో 142 మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యలేనని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. పటాన్‌చెరులో తనను కలిసిన ఆటో డ్రైవర్లతో మాట్లాడారు హరీష్.
ఎన్నికల ముందు ఏడాదికి రూ. 12,000 భృతి ఇస్తామన్న హామీ ఇచ్చి మోసం చేశారు కానీ ఇప్పుడు ఆటో కార్మికుల గురించి ఒక్క మాటా మాట్లాడడం లేదు అన్నారు. ఆటోలు నడవక, బ్యాంకుల కిస్తీలు చెల్లించలేక ఆర్థికంగా కుదేలవుతున్నారు. అయినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదు…. ఆటో కార్మికుల కుటుంబాల పోషణ భారంగా మారి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు అన్నారు.
ఎన్నికల ముందు హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చాక మాట తప్పడం రేవంత్ రెడ్డికి అలువాటుగా మారింది..అసెంబ్లీ వేదికగా కూడా ఆటో కార్మికుల పక్షాన ప్రశ్నించినది బీఆర్ఎస్ అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం బీఆర్‌ఎస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది. ఆటో కార్మికులకు కేసీఆర్ అండగా ఉంటారు అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల హామీలను అమలు చేసి, ఆటో కార్మికులకు భద్రత కల్పించాలని బీఆర్‌ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం..చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ. 10 లక్షల ఆర్థిక సాయం చేయాలి. రెండేళ్లుగా ఒక్కో కార్మికుడికి బాకీ పడ్డ రూ. 24 వేలను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.
Also Read:ఎస్‌జె సూర్య… “కిల్లర్”

