ఆగస్టు 15లోగా రుణమాఫీ, ఆరు గ్యారంటీలు అమలు చేయాలని మరోసారి డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాల్‌ను స్వీకరించి తన రాజీనామా పత్రంతో అమరుల స్తూపం వద్దకు వచ్చానని… దేవుళ్లపై ప్రమాణాలు చేసి ప్రజలను మోసంచేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు హరీష్.
రేవంత్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిజమైతే గన్‌పార్క్ వద్దకు ముఖ్యమంత్రి రావాలని..ఇద్దరి రాజీనామా పత్రాలను మేధావుల చేతుల్లో పెడదామన్నారు హరీష్.
అమలు చేయకపోతే రేవంత్ రెడ్డి తన రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వాలన్నారు. రాజీనామాకు ముందుకు రావట్లేదంటే ప్రజలను మోసగించినట్లేనని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయించడమే తమ కర్తవ్యమని వెల్లడించారు. ఆరు గ్యారంటీలపై తొలి సంతకం పెడతామని మోసగించారని చెప్పారు. ప్రజలను మోసం చేసినందుకుగాను బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బాండ్లకు కాలం చెల్లిందని సీఎం రేవంత్ రెడ్డి దేవుడిపై ప్రమాణాలు చేస్తున్నారని విమర్శించారు. తన ఎమ్మెల్యే పదవి కంటే ప్రజలకు మేలు జరిగితే మంచిదేనని చెప్పారు.