Harish:గీతన్నలకు అండగా నిలిచాం

27
- Advertisement -

సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలో గౌడ కమ్యూనిటీ హల్‌ను ప్రారంభించారు మాజీ మంత్రి హరీష్ రావు. ఎల్లమ్మ తల్లి దయతో రూ. 20 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మించుకున్నాం అన్నారు. రాష్ట్రంలో నీళ్లు లేక పంటలు ఎండిపోతుంటే ఈ మండలంలో మాత్రం ఎండాకాలంలో సైతం చెరువులో నీళ్లు సమృద్ధిగా ఉన్నాయన్నారు. దీనికి కారణం కాళేశ్వరం ప్రాజెక్టు, కెసిఆర్ కృషే. కెసిఆర్ అధికారంలోకి వచ్చాకే గౌడ కమ్యూనిటీకి చెట్ల పన్ను రద్దు చేసి, వైన్స్ టెండర్లలో గీత కార్మికులకు రిజర్వేషన్లు కల్పించాం అన్నారు.

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ మాసంలో నిర్వహించే ఉపవాస దీక్షలు, దైవ ప్రార్థనలతో సామరస్యం, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను అన్నారు. క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనల కలయికే రంజాన్‌ మాసం విశిష్టత. సేవా దృక్పథానికి, సహనానికి ప్రతీకగా ఈ పండుగను జరుపుకోవడం సంతోషకరం అన్నారు.

సిద్దిపేట గణేష్ నగర్‌లోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో నిర్మించిన శ్రీరామ కల్యాణ మండపాన్ని ప్రారంభించడం జరిగింది.ఆలయం దినదినాభివృద్ధి చెందడం సంతోషకరం. దైవచింతన, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. కల్యాణ మండపాన్ని అద్భుతంగా నిర్మించినందుకు ఆలయ నిర్వాహకులకు అభినందనలు. మీకు నా సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.

Also Read:Teeth Pain:పంటి నొప్పికి ఇంటి వైద్యం

- Advertisement -