Harishrao:రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తే ఊరుకోం

18
- Advertisement -

రైతు ప్రయోజనాలను దెబ్బ తీస్తే మేము ఊరుకోం అని హెచ్చరించారు మాజీ మంత్రి హరీష్‌ రావు. పెద్దపల్లి జిల్లా అన్నారం బ్యారేజ్ వద్ద కాళేశ్వరం ప్రాజెక్ట్ పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. మేడి గడ్డ తెలంగాణ భవిష్యత్ కు సంబందించిన సమస్య…వెంటనే మేడి గడ్డ రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు.

తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఇబ్బందులు కలిగితే కేసీఆర్ ఊరుకోడు…మేడి గడ్డ కు వెళ్తున్నాం అంటేనే కాంగ్రెస్ పోటీ యాత్రలు చేస్తుంది అని ఆరోపించారు.నల్గొండలో సభ తో కృష్ణ జలాల పై ప్రభుత్వం వెనక్కి తగ్గింది…మేడి గడ్డ రి పెర్ చేస్తామని ఉత్తమ కుమార్ చెప్పారంటే మా యాత్ర సక్సెస్ అయిందన్నారు. గత ప్రభుత్వాలను బద్నాం చేయాలనేది తప్ప వేరే కనిపించడం లేదు అన్నారు.

గోబెల్స్ ప్రచారం చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్న ప్రభుత్వం ఎదైన ఉందా అంటే ఒక్క కాంగ్రెస్ ప్రభుత్వమే…కాళేశ్వరం వంద కంపోనెంట్లలో మేడి గడ్డ ఒకటి…మూడు పిల్లర్లు కుంగితె ప్రాజెక్ట్ మొత్తం వ్యర్దం అయిందని అనడం దారుణం అన్నారు.రానున్న వానాకాలం లోపే మేది గడ్డ రిపేరు చేసి రైతులను ఆదుకోవాలి…రాజకీయాలకు ఇది సమయం కాదు అన్నారు.

రైతుల జీవితాలతో ఆడుకోవద్దు, వానాకాలం లోపు నీళ్ళు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం…కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని సిఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అన్నాడు…అందుకే కాళేశ్వరం పై కుట్రలు చేస్తున్నారు అని ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న చరిత్ర రేవంత్ రెడ్డికి లేదు, కనీసం పరిపాలనలో అయిన నిజాయితీ నిరూపించుకోవాలి…గత కాంగ్రెస్ హయాంలో జరిగినంత అవినీతి ఎన్నడూ జరగలేదు

జన యజ్ఞాన్ని దన యజ్ఞం గా మార్చారు ఆనాటి కాంగ్రెస్..7 ఏళ్లు అధికారంలో వుంటే తమ్ముడి హాట్టి దగ్గర తట్టెడు మట్టి ఎత్తలేదు కాంగ్రెస్ అని మండిపడ్డారు.7 ఏండ్లు వృదా చేశారు, కానీ ప్రాజెక్టు నిర్మాణం చేయలేదు కానీ నాలుగేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి నీళ్ళిచ్చిన నాయకుడు కేసీఆర్ అన్నారు. ప్రతిపాదిత జీవో తో ఒక్క ప్రాజెక్ట్ అయిన పూర్తి అయిందో చెప్పాలి..కాళేశ్వరం కనీసం రెండు రెట్లు కూడా అంచనా పెరగలేదు…ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజం అవుతుందని కాంగ్రెస్ నేతలు నమ్ముతున్నారు….కాళేశ్వరం తో 200 శాతం మత్స సంపద పెరిగిందన్నారు.

కాళేశ్వరం నీళ్ళు చెరువులకు అనుసంధానం చేసిన నాయకుడు కేసీఆర్…40 యేండ్ల లో చేసిన ఆయకట్టు మేము 4 యేండ్ల లో చేసి చూపాం….సిగ్గులేకుండా కాంగ్రెస్ నాయకులు పాలమూరు పర్యటన చేస్తున్నారు అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో ఎన్నో ప్రాజెక్టులు కొట్టుకు పోయాయి…కేంద్ర ప్రభుత్వం డిజైన్ చేసి కట్టిన పోలవరం కొట్టుకుపోయింది నిజం కాదా ఆలోచించాలన్నారు. పోలవరం కొట్టుకుపోయి 5 యేండ్లు అయిన NDSA రిపోర్ట్ రాలేదు, కానీ మేడి గడ్డ కు రెండు రోజులకే రిపోర్ట్ వచ్చింది….జరిగిన దాని మీద విచారణ చేసి దోషులను శిక్షించండి కానీ కాలయాపన చేసి రైతులను మోసం చేయద్దు అన్నారు. మేడి గడ్డ ను వెంటనే రిపేర్ చేసి వానాకాలం లోపు రైతులకు నీళ్ళు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అన్నారు.

Also Read:‘కల్కి’కే ట్రబుల్ ఇస్తున్నాడా?

- Advertisement -