తెలంగాణ నీళ్లు..ఆంధ్రాకా?

8
- Advertisement -

ఈరోజు ఢిల్లీలో జరగబోతున్న జల వివాదాల సమావేశాలకు ఆదిత్యనాథ్ దాస్‌ను తెలంగాణ తరఫున పంపుతున్నట్లు ప్రకటించడంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో అనేక ప్రాజెక్టులను అడ్డుకుని, వాటిపై పిటిషన్లు వేసిన వ్యక్తినే రాష్ట్ర ప్రతినిధిగా ఎలా పంపుతారని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నరనరాన తెలంగాణ వ్యతిరేకతను మూటగట్టుకున్న ఆదిత్యనాథ్ దాస్‌ను ఢిల్లీ సమావేశాలకు పంపితే రాష్ట్ర ప్రయోజనాలు ఎలా కాపాడబడతాయని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

కేసీఆర్ పాలనలో తెలంగాణలో 2 కోట్ల 20 లక్షల ఎకరాల మాగాణి సాగు జరిగిందని, దీనిని కేంద్ర ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించిందని ఆయన గుర్తు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ కాకతీయ వల్ల 32 లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమైందని, అందువల్లే సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ వాస్తవాలను విస్మరించి మాట్లాడుతున్న బండి సంజయ్, కిషన్ రెడ్డిలు నోరు మూసుకుంటే మంచిదని ఆయన సూచించారు.

నీటి జలాలపై బీఆర్ఎస్ ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టిన తర్వాతే ప్రభుత్వం స్పందించి కేంద్రానికి లేఖ రాసిందని హరీష్ రావు తెలిపారు. ఆ లేఖలో నల్లమల సాగర్ ప్రాజెక్ట్ డీపీఆర్ తయారీని ఆపాలని, అలాగే సీడబ్ల్యూసీలో అనుమతుల ప్రక్రియను నిలిపివేయాలని రెండు షరతులు పెట్టారని చెప్పారు. ఈ షరతులకు కేంద్రం అంగీకరించిందా లేదా స్పష్టత లేకుండానే ఢిల్లీ సమావేశానికి వెళ్తుండటంపై అనుమానం వ్యక్తం చేస్తూ, తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పగించి ప్రజలను మోసం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందని హరీష్ రావు తీవ్ర ఆరోపణలు చేశారు.

Also Read:హిమాలయాల్లో ‘ఆపరేషన్ పసిఫిక్’

- Advertisement -