ఓటు వేసిన మంత్రులు..

222
vote
- Advertisement -

తెలంగాణ వ్యాప్తంగా అసెంబ్లి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్‌ సెంటర్లకు చేరుకుంటున్నారు ఓటర్లు. మంత్రులు,పలువురు ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దాన కిషోర్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బేగంపేటలో పోలింగ్‌ కేంద్రంలో దాన కిషోర్‌,ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌, రాచకొండ సీపీ మహేశ్‌ భగవత్‌ ఓటు వేశారు. మహబూబ్ నగర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో కలెక్టర్‌ రోనాల్డ్‌ రోస్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

సిద్దిపేటలో హరీశ్ రావు దంపతులు ,సూర్యాపేటలో జగదీశ్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులు ,ఖమ్మం జిల్లా గొల్లగూడెంలో ఆపద్ధర్మ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఓటు హక్కును వినియోగించుకున్నారు నిర్మల్ ఎల్లపల్లిలో ఇంద్రకరణ్ రెడ్డి, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పోచారం శ్రీనివాసరెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

మెదక్‌ జిల్లా కొనాయిపల్లిలో డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌ రెడ్డి ,కరీంనగర్ లో ఎంపీ వినోద్,నల్గొండలో ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

- Advertisement -