- Advertisement -
ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్,మంత్రి కేటీఆర్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల సీఎం సిరిసిల్ల పర్యటన పూర్తి చేసుకున్న కేటీఆర్..సిద్దిపేట పొన్నాల దాబా వద్ద సందడి చేశారు.
ఓ షాపులో టీ ఆర్డర్ చేసిన కేటీఆర్ స్దానికులతో ముచ్చటించారు.క్షణాల్లో కేటీఆర్ చుట్టూ గుమిగూడి సెల్ఫీల కోసం పోటీపడ్డారు. స్థానికంగా ఉన్న పరిస్థితుల గురించి చర్చించారు.
అక్కడి నుండి బయలుదేరే ముందు మా బావ హరీశ్‌రావుకు లక్ష మెజారిటీ దాటేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని పిలుపునిచ్చారు. కేటీఆర్ అన్న ఈ మాటలతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
- Advertisement -