Harish:ప్రతిపక్షాల గొంతు నొక్కడం సరికాదు

0
- Advertisement -

వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్న మాగనూరు ZPHS పాఠశాలను సందర్శించడానికి వెళ్తారనే నెపంతో మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బిఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం దుర్మార్గమైన చర్య. తీవ్రంగా ఖండిస్తున్నాం అన్నారు మాజీ మంత్రి హరీశ్‌ రావు.

పాఠశాలలు సందర్శించడానికి వెళ్తే ప్రభుత్వానికి ఎందుకు అంత భయం?,పురుగులన్నం మాకొద్దు అని విద్యార్థులు రోడ్డెక్కి నినదిస్తుంటే చీమ కుట్టినట్లైనా లేదా?,
విద్యార్దులకు మంచి భోజనం కూడా పెట్టని దీన స్థితిలో ఈ ప్రభుత్వం ఉందా? చెప్పాలని డిమాండ్ చేశారు.

అప్రాజ్యస్వామిక విధానాలు విడనాడాలని, అరెస్టు చేసిన మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డితో పాటు, బి ఆర్ ఎస్ నాయకులకు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ప్రతిపక్షాల గొంతు నొక్కడం కాదు…ఫుడ్ పాయిజన్ వల్ల ఆసుపత్రి పాలైన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించండి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలన్నారు.

 

Also Read:TRAI: ఓటీపీ మెస్సేజ్‌లు ఆలస్యం

- Advertisement -