పవన్‌కు సర్‌ప్రైజ్ ఇచ్చిన హరీష్‌!

3
- Advertisement -

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పవన్. ఈ కార్యక్రమంలో మెగాబ్రదర్స్ అట్రాక్షన్‌గా నిలవగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇక తాజాగా ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తూ పవన్ అభిమానులకు ఉస్తాద్ భగత్ సింగ్ టీమ్ మరో గిఫ్ట్ ఇచ్చింది.

స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ లో పవన్ పోలీస్ డ్రెస్ లో పవర్ ఫుల్ గా నడిచి వస్తున్నాడు. పోస్టర్ పై సనాతన ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని రాసి ఉంది. ఈ పోస్టర్ రిలీజ్ చేస్తూ పవన్ కు శుభాకాంక్షలు తెలిపింది మూవీ యూనిట్. దీంతో ఫ్యాన్స్ ఆనంధానికి అవధుల్లేకుండా పోయాయి.

- Advertisement -