హరీష్‌శంకర్‌ ట్వీట్‌కు కారణం ఆదేనా….!

303
- Advertisement -

స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్ హీరోగా హరీష్‌శంకర్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రం డీజే.  ఈ సినిమా టీజర్‌ ఇటీవలే మహాశివరాత్రి సందర్భంగా విడుదలై య్యూట్యూబ్‌లో ఐదు మిలియన్ల్‌కు పైగా వ్యూస్ సాధించింది. బ్రహ్మణ గెటప్‌లో బన్నీ చేసిన యాక్టింగ్‌ అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా బన్నీ అభిమానులు ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకున్నారు.
Harish Shankar Responds On Dislikes for DJ Teaser
అయితే టీజర్‌ విడుదల దగ్గర నుంచి డీజేకు ఎన్ని లైక్‌లు వచ్చాయో…అన్ని డిస్‌లైక్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన రూమర్‌ ఒకటి టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. పవన్‌కు అల్లుఅర్జున్‌కు మధ్య విభేదాల కారణాల వల్లే ఈ టీజర్‌కు ఇన్ని డిస్‌లైక్స్‌ వచ్చాయని జోరుగా ప్రచారం జరుగుతుంది.పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాన్‌ అభిమానులు కావలనే డీజే టీజర్‌కు డిస్‌లైక్స్‌ కొట్టరని ఫిల్మ్‌సర్కిల్‌లో వినిపిస్తున్న మాట. బన్నీ టీజర్‌కు ఈ స్థాయిలో డిస్ లైక్స్ రావడం ప్రస్తుతం టాలీవుడ్‌లో చర్చనీయాంశం అయింది.
 Harish Shankar Responds On Dislikes for DJ Teaser

ఈ పరిణామాల నేపథ్యంలో డీజే దర్శకుడు హరీష్‌శంకర్‌ నిన్న చేసిన ట్వీట్‌ ఇప్పుడు సెన్సేషన్‌ అయ్యింది. ఆ ట్వీట్‌లో పవన్‌ కళ్యాన్‌ ప్రస్తావన తేక పోయినా….అందులో అర్థం మాత్రం అదే అంటున్నారు సినీ పండితులు. డిజే టీజర్ 5 మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్న సందర్బంగా హీరీష్ ఓ ట్వీట్ చేసారు. థాంక్స్ ఫర్ దట్ వ్యూస్, థాంక్స్ ఫర్ దిస్ లైక్స్, యత్ భావమ్ తత్ భవతి….. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే… అంటూ హరీష్ శంకర్ ట్వీట్ చేసారు.

మొత్తం మీద డీజే దర్శకుడు హరీష్‌ శంకర్‌ ట్వీట్‌కు కారణం మాత్రం పవన్‌ ఫ్యాన్స్‌ను తన ట్వీట్టర్‌  వేదికగా డైరెక్టర్‌గా హెచ్చరిచడమే అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

- Advertisement -