హరీష్ నెక్ట్స్ ప్రాజెక్టు ఇదే..!

403
harish shankar
- Advertisement -

రవితేజ హీరోగా షాక్ సినిమాతో దర్శకుడిగా మారాడు హరీశ్ శంకర్. తర్వాత మిరపకాయ్, గబ్బర్ సింగ్,గద్దలకొండ గణేశ్, దువ్వాడ జగన్నాథం వంటి సినిమాలు తెరకెక్కించి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకున్నారు.

తాజాగా మలయాళ రీమేక్ మూవీని డైరెక్ట్ చేయనున్నారు హరీశ్ శంకర్. మలయాళంలో సూపర్ హిట్ వినూత్న కథా చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియం’ని రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రం రీమేక్ హక్కులను సొంతం చేసుకుంది.

వాస్తవానికి పవన్ కల్యాణ్ తో హరీశ్ తన నెక్ట్స్ ప్రాజెక్టు చేయాల్సి ఉంది. అయితే, లాక్ డౌన్ కారణంగా పవన్ చేయాల్సిన ఇతర ప్రాజెక్టులు ఆలస్యం కావడంతో, హరీశ్ తో చేయాల్సిన చిత్రం కూడా ఆలస్యం కానుంది. ఈలోపు ఈ మలయాళ రీమేక్‌ని కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు హరీశ్ శంకర్. సినిమాలో రవితేజ హీరోగా నటించే ఛాన్స్ ఉంది.

- Advertisement -