యూత్‌ని మెప్పించేలా…దాగుడుమూతలు

205
Harish Shankar Dagudu muthalu with Multistarrer
- Advertisement -

సుబ్రమణ్యం ఫర్ సేల్’ .. ‘ దువ్వాడ జగన్నాథం’ సినిమాలతో ఆడియన్స్ ను అలరించిన హరీశ్ శంకర్, తన నెక్ట్స్ సినిమాకి సంబంధించిన పనుల్లో బిజీగా ఉన్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి దాగుడు మూతలు అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నితిన్, శర్వానంద్ లతో మల్టీస్టారర్‌గా రానున్న ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనే దానిపై సన్పెన్స్ కొనసాగుతోంది.

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్క్రిప్ట్ ను హరీశ్ శంకర్ సిద్ధం చేశాడు. మే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి ప్లాన్ చేశారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో, మాస్ ను .. యూత్ ను కూడా మెప్పించేలా హరీశ్ శంకర్ జాగ్రత్తలు తీసుకున్నాడు.

ఈ సినిమాకు దిల్ రాజుతో పాటు హ‌రీష్ శంక‌ర్ కూడా నిర్మాణంలో భాగం పంచుకుంటున్నాడు. అనిల్ రావిపూడితో ఓ సినిమా .. సతీశ్ వేగేశ్నతో ఓ సినిమాను నిర్మిస్తోన్న దిల్ రాజు, హరీశ్ శంకర్ తో ఈ సినిమాను ప్లాన్ చేయడం విశేషం.

- Advertisement -