కేసీఆర్ సీఎం కావడంతోనే గోదావరి జలాల కల సాకారం అయిందని తెలిపారు మంత్రి హరీష్ రావు. కరోనా లేకపోతే కనివినీ ఎరగని రీతిలో జిల్లాలో నీళ్ల పండుగ జరిపేవాళ్లమని తెలిపారు. రంగనాయక సాగర్ ఎడమ కాలువ వెంట గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించారు హరీష్.
మొదటి దశలో చిన్నకోడూర్, నారాయణరావుపేట, సిద్ధిపేట రూరల్ మండల చెరువులు, కుంటలు నింపుతామన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేసి అసంపూర్తి కాలువ పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
చౌడారం, మేడిపల్లి, చెర్ల అంకిరెడ్డిపల్లి, మైలారం గ్రామాల్లో కాలువ భూ సేకరణ త్వరగా చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. కాల్వల వెంట పంట పొలాలు ఉన్న రైతులు పంట కాల్వలకు సహకరించాలని, పిల్ల కాల్వలు తవ్వుకోవాలని సూచనలు చేశారు. 6 గంటలు.. 70 కిలో మీటర్లు రంగనాయక సాగర్ ప్రధాన ఎడమ కాల్వ, పిల్ల కాల్వల వెంట క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు హరీష్.