అభివృద్ది అంటే పట్టణాలు, పరిశ్రమలే కాదు, పల్లెల ఆర్థిక పరిపుష్టి కూడా అభివృద్దే అన్నారు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు. నేడు గ్రామీణ తెలంగాణకు జవసత్వాలు తెచ్చి, గ్రామాల్లోనే వేల కోట్ల సంపదను సృష్టించాలన్న మహోన్నత లక్ష్యంతో గొర్రెల పంపిణీ పథకానికి శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్ రావు రైతులు, పల్లెల అభివృధ్ధి ని ఉద్ధేశించి మాట్లాడారు. గొర్రెల పంపిణీని సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కొండపాక మండల కేంద్రం నుంచి ప్రారంభించడం సంతోషకరమని అన్నారు.
అంతేకాకుండా గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించే ఈ రోజున కొండపాకలో బీరప్ప పండగ వాతారవణం నెలకొన్నది అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు పెద్ద పీట వేసేదిశగా అడుగులు వేస్తోందని, ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని అన్నారు. ఇప్పటికే మిషన్ భగీరథ పథకానికి ప్రజల్లోంచి విశేషమైన స్పందని వచ్చిందని , ఈ పథకం వల్ల తెలంగాణలో నీటి సమస్యలు ఉండవన్నారు. అంతేకాకుండా రైతులను దృష్టిలో పెట్టకునే రెప్పపాటు కొతల్లేకుండా కెరెంటును అందిస్తున్నామన్నారు. ఇక సిద్దిపేట జిల్లాలో 8,500 గొర్రెలపంపిణీ చేస్తున్నామని తెలిపారు.

