సిద్దిపేటకు నేడు గోల్డెన్‌ డే- మంత్రి హరీష్

136
harish
- Advertisement -

సిద్దిపేటలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రారంభమైంది. ఈ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు హరీష్ రావు, ఈటల రాజేందర్, నిరంజన్ రెడ్డి, ఇతర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి హరీష్ రావు ప్రశంసలజల్లు కురిపించారు. సిద్దిపేటకు నేడు గోల్డెన్‌ డే గా అభివర్ణించారు.

రూ.1000 కోట్ల పనులకు శంకుస్థాపన, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నామని అన్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా వైద్య కళాశాలను ప్రారంభించుకోవడం నియోజకవర్గం అదృష్టంగా పేర్కొన్నారు. 960 పడకల ఆస్పత్రికి శంకుస్థాపన చేసుకున్నామని పేర్కొన్నారు. ఆత్మగౌరవ పొదిరిల్లులాంటి ఇండ్లను ప్రారంభించుకున్నామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లను ఎవరూ అడగలేదని, ఎవరూ దరఖాస్తు చేయలేదని చెప్పుకొచ్చిన హరీష్ రావు.

పేద ప్రజలకు సౌకర్యవంతమైన ఇళ్లు నిర్మించి ఇవ్వాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ ఈ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను నిర్మించి ఇస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లు మురికి కూపాలుగా ఉండేవని మంత్రి వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వం కట్టిన ఇళ్లు ఆత్మగౌరవానికి ప్రతిరూపాలన్నారు. ఇళ్లలోకి అడుగు పెడుతుంటే అక్కా చెల్లెళ్ల కళ్ల నుంచి ఆనందబాష్పాలు చూస్తుంటే తన జన్మధన్యమైందని హరీష్ రావు వ్యాఖ్యానించారు.

- Advertisement -