తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించండి..

163
harish

సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇందిరా నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాట్కో పార్మా లిమిటెడ్ హైదరాబాద్ సౌజన్యంతో సంపూర్ణ వసతులు, సౌకర్యాలతో నిర్మించిన నాట్కో ట్రస్ట్ బ్లాక్ ప్రారంభోత్సవం మరియు tech AADYS సౌజన్యంతో విద్యార్థులకు క్రీడా దుస్తుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు, జెడ్పీ చైర్మన్ రోజా శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ మాట్లాడుతూ.. నాట్కో సహకారం, ఉపాధ్యాయుల పట్టుదల వల్ల ఒక పాఠశాల ఇందిరా నగర్ పాఠశాలలా ఉండాలి అనే విధంగా ఉంది. నాట్కో సహాయంతో కోటి 44 లక్షలతో అన్ని సదుపాయాలు ఏర్పాటు చేశారు.స్కూల్ కాంపౌండ్ వాల్ కోసం 24 లక్షలతో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ స్కూల్ లో16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని హరీష్‌ అన్నారు.

నాట్కో సహాయంతో మరో 40 లక్షలతో మరో నాలుగు అదనపు గదులు ఏర్పాటు చేస్తాం. ఈ స్కూల్ కి నాట్కో సహాయం చేసినందున ప్రభుత్వం వారి పేరున నాట్కో జిల్లా పరిషత్ పాఠశాలగా జీఓ విడుదల చేసింది. పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలి వారి నామకరణం చేసేందుకు ప్రభుత్వం సహకరిస్తుంది. ప్రైవేట్ స్కూల్ విద్యార్థుల కంటే అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు ఈ స్కూల్ ఉపాధ్యాయులు అని మంత్రి తెలిపారు.

ప్రైవేట్ స్కూల్ తో పోల్చుకుంటే ఏడాదికి సుమారు 3 కోట్ల రూపాయలను అదా చేస్తుంది ఈ స్కూల్. ఉపాధ్యాయుల పిల్లలు ఈ స్కూల్ లో చదవడం ఈ స్కూల్ గొప్పతనం. విద్యార్థులు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ స్కూల్ లో వాటర్ బెల్ కార్యక్రమం ప్రారంభించాలి. రాబోయే రోజుల్లో మిగిలిన సదుపాయాలను సమకూరుస్తాం. నెల రోజుల్లో స్కూల్ కాంపౌండ్ వాల్ పూర్తి చేస్తే చుక్క రామయ్య, ప్రిన్సిపాల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి లను ప్రారంభానికి ఆహ్వానిస్తామని మంత్రి అన్నారు.

ఈ స్కూల్ అభివృద్ధికి తల్లిదండ్రులు తోచిన సహాయం చేయండి.ప్రైవేట్ స్కూల్ లల్లో 20 వేల పిజులు పెట్టీ చదివిన 10/10 20 మందికి వస్తలేవు, కానీ ఈ స్కూల్ విద్యార్థులు సాధిస్తున్నారు.10/10 సాధించిన ప్రతి విద్యార్థికి 25 వేల రూపాయలు నగదు బహుమతిని అందిస్త..తల్లిదండ్రులు పదవతరగతి విద్యార్థులకు ఇంట్లో చదువుకునే వాతావరణం కల్పించండి. మీ పిల్లలకు ట్యూషన్ చెప్పే బాధ్యత కూడా మేమే తీసుకుంటున్నాం. తల్లిదండ్రులు పిల్లలకు మంచి అలవాట్లు నేర్పించండి. ఈ స్కూల్ ఉపాధ్యాయులు తమ సొంత పిల్లల మాదిరి కష్టపడుతున్నారు అని మంత్రి హరీష్‌ పేర్కొన్నారు.

Harish Rao, Minister of State for Sports Clothing Distribution Program for Students with Natco Trust Block Opening and Tech AADYS..